02 మార్చి, 2016

కాళిదాసు కుమారసంభవం గురించి పరిచయ వాఖ్య



ఈరోజు మహాకవి " కాళిదాసు" రాసిన " కుమారసంభవం " పుస్తకం చదివాను పూర్తిగా...!!!

 శివపార్వతుల కళ్యాణం, కుమారస్వామి పుట్టుక ఈ కధలో ప్రధాన అంశాలు...

 ఈ కధకి మూలం శివ,అగ్ని,లింగాది పురాణాలు, వాటిలో ఇంతకు ముందే నేను ఈ కధ చదివాను. కానీ అందులో ఉన్న విషయానికకీ ఈ కావ్యానికీ ఎంతో తేడా ఉంది...!!!

 అడవిలో పుష్ప రసానికి,గిన్నెలో తేనెకి ఎంత బేధం ఉందో ఆ పురాణాలలో కధకి, ఈ పుస్తకానికి అంత బేధం ఉంది ...!!!

 చమత్కారమూ,ధ్వని,రసపుష్టిగల ఘట్టాలు ఈ కావ్యంలో అనేకం...!!

 సాహిత్యంలో అంతో ఇంతో అభినివేశం కల్పించుకోవాలనుకునే ప్రతీవాడూ కాళిదాసు కావ్యాలు చదవాల్సిందే,

 లేకపోతే అతడి సాహిత్య జ్ఞానం మిడి మిడి జ్ఞానం క్రిందనే లెక్క.

 " ఉపమా కాళిదాసస్య .... " ఉపమానాలు ఆచి తూచి ప్రయోగించడంలో అతనికి అతనే సాటి. అందుకే అతను కవికుల గురువు. అతని కవితాశోభని నేను మాత్రం ఎంతని వర్ణించగలను?

 నాకు చేతనైనంతలో ఎంతో కొంత చెప్పాను ఈ పుస్తకం గురించి,

 మీకూ వీలైతె తప్పకుండా చదవండి ఈ పుస్తకాన్ని,

 ఒక అద్భుతమైన పుస్తకం ఇది.

 ఇంతకి మించి మాటలేం సరిపోవు ఈ పుస్తకానికి....!!!

 శుభరాత్రి...!!!

 - Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి