15 ఆగస్టు, 2015

స్వాతంత్రదినోత్సవం సందర్భంగా స్వేచ్చ,స్వాతంత్రంగురించి రాసిన ఓ వ్యాసం



మనిషికి స్వేచ్చ ఎప్పుడూ ఉంటుంది,, కానీ ఆ స్వేచ్చకే కొన్ని పరిమితులు ఉండడం వల్ల తనకి స్వాతంత్రం లేదనుకుంటాడు మనిషి...

అసలేది నిజమైన స్వాతంత్రం? మనమసలు నిజంగా ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నమా??

సొంతంగా తన అభిప్రాయం చెప్తే అవతలి వాడు ఏమనుకుంటాడో అని భయపడుతూ అవతలి వాడి మాటలతో ఏకీభవిస్తున్నట్లు నటించే మనిషిక వాక్ స్వాతంత్ర హక్కు ఏం ఉన్నట్లు?

తన అభిప్రాయాలతోటి తాను ధైర్యంగా బ్రతకలేడు....సమాజం పెట్టిన పద్దతులకి బానిస అయిపోతున్నాడు మనిషి,..

సమాజం నిర్ణయించిన కొన్ని విధానాలు తనని ఆర్ధికంగా,,సామాజికంగా పీల్చిపిప్పిచేస్తున్నా వాటిని " కాదు,,నేనిది చెయ్యను " అని చెప్పే ధైర్యం లేని మనిషికి జీవించే హక్కు ఏముంది??? చెప్పుకుంటూపోతే అసలు స్వాతంత్రమనేది ఏముంది నిజంగా మనకి ? అని అనిపిస్తుంది..

సంపూర్ణ మానసిక స్వేచ్చతో బ్రతికే పరిస్థితి ఎప్పుడొస్తుందో నా దేశ ప్రజలకి? భగవంతుడా ఆ దిశగా నా దేశప్రజలను నడిపించు...!!!

స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి