03 మార్చి, 2016

నీ వ్యక్తిగత ప్రవర్తనే నీ కష్టాలకి హేతువు,, ఉపశమనంకూడా



"" దేవుడు మనిషిని సృష్టిస్తూ తర్కమూ,,జ్ఞానమూ అనే రెండు గొప్ప ఆయుధాలను బహుమతిగా ఇచ్చాడు... " వీటితో నీ రాతని నీకు నచ్చేట్లు,,నువ్వు మెచ్చేట్లు రాసుకుని హాయిగా జీవించమని " మనలని భూమి మీదకి పంపితే మనం మన ఇష్టం వచ్చినట్లు గీసేసుకుని " నా తలరాత ఇట్లా రాశావేం ? " అని ఆయన్ని నిందిస్తూ బాధపడడం చాలా అన్యాయం కదూ??? ""
 
( ఎవరకీ లేనన్ని కష్టాలు కేవలం తమకి మాత్రమే ఉన్నాయని తరచూ నిరాశలో కూరుకుపోయేవాళ్ళతోనూ,,ఆ కష్టాలకి కారణం కర్మ అనో,,యోగమనో,,జాతకం బాలేదనో కారణం ఆపాదించుకుని తాత్కాలిక ఉపశమనం పొందే వ్యక్తులని చూస్తే ఇదే చెప్పాలనిపిస్తుంది నాకు...

మనకి వచ్చే ఏ సమస్యకైనా సాధారణంగా శారీరక,,మానసిక,,సామాజిక,,రాజకీయ పరమైన విషయాలే కారణాలై ఉంటాయి...వీటిని సాధ్యమైనంత వరకూ దేవుడు మనకిచ్చిన ఈ ఆయుధాలతో మార్చుకోవడం పెద్దవిషయమేం కాదు నిజానికి...కానీ చాలా మంది మనుష్యులు ఈ విషయాన్ని గుర్తించక " నా బ్రతుకింతే " అన్నట్లు ఏడుస్తూ బ్రతుకుతారు సమస్యయొక్క మూలకారణం గురించి సరిగా తర్కించక....

తమ సమస్యలను ఇతరులకి చెప్పుకుని ఏడ్చేవాళ్లల్లోకూడా చాలామంది ఎదుటి వ్యక్తి యొక్క సానుభూతి పొందడానికో,,లేక తనకి తాత్కాలిక మానసిక నిశ్చింత కలగడానికో అలా ప్రవర్తిస్తారేతప్ప నిజంగా వీళ్లకి " ఈ సమస్యనుంచి బయటపడడానికి నేనేం చెయ్యాలి ? "అనే ఆలోచనకానీ,, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి తగ్గ పట్టుదల కానీ ఉండదు.ఏదో అద్భుతాలు జరిగి ఈ కష్టాలు గట్టిక్కిపోతాయనే ధీమా మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది వీళ్ళదగ్గర..అయినా నిరంతర చింతనాపరులు వీళ్ళు మళ్ళీ..

" నీ వ్యక్తిగత ప్రవర్తనే నీ కష్టాలకి హేతువు,,ఉపశమనంకూడా " అనే సిద్ధాంతాన్ని ఒప్పుకునేవాళ్ళు తక్కువ ప్రపంచంలో ,,ఒప్పుకుని మనస్పూర్తిగా ఆచరించేవాళ్ళు ధన్యులు_/\_

ఇంతకీ మీరెవరు ఇందులో?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి