25 మార్చి, 2016

నమ్మకం Vs నిజం




" మనిషి చేసే పనులను  నమ్మకం,,నిజం అనే రెండు అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి

నమ్మకం నిజమవ్వచ్చు కానీ నిజం ఎప్పుడూ మనం నమ్మే నమ్మకమే అవ్వాలని రూలేమీలేదు...ఆ విషయం సరిగ్గా తర్కించక మనం మన జీవితంలో కొంత సమయాన్నీ,,ధనాన్నీ వృధాగా ఖర్చుచేస్తూ ఉంటాము అర్ధంపర్ధంలేని విషయాలపై ఫలితాలేవో ఆశించి ..... వాటివల్ల మనకి తాత్కాలిక మానసిక తృప్తి కలుగుతుందేతప్ప శాశ్వత పరిష్కారం ఏదీ లభించదు....ఈలోపులోనే మనం మోసపోతాం మనకి "మనం మోసపోయాం " అనే విషయం కూడా గుర్తెరగకుండానే (ఉదాహరణకి టీ.వీ లో ప్రకటనలేవో వస్తున్నాయికదా ధనలక్ష్మీ మహాయంత్రము అని,,శని సురక్షక కవచం అని ఏవేవో...అవి కేవలం ధరించినమాత్రం చేతనే మనం మనయొక్క సమస్త కష్టాలనుంచీ విముక్తులము అయిపోతామట...!!! అలా ఎలా ఆవుతాము? అనే కనీస ఆలోచనకూడా చేయకుండా మూడేసివేలూ,ఐదేసివేలూ ఉత్తిపుణ్యాన తగలెట్టుకునే అమాయకులున్నారు మన సమాజంలో !! కేవలం ప్రార్ధన చేస్తేనో,,లేక ఆ ప్రార్ధనానూనె తమపై చల్లుకుంటేనో సమస్త రోగాలూ తగ్గిపోతాయి వైద్యుడి అవసరంలేకుండానే అని నమ్మే అనేకమంది వ్యక్తులూ ఉన్నారు మనప్రపంచంలోనే :(  కేవలం అలా నూనె చల్లుకున్నంత మాత్రాన వ్యాధులు ఎలా తగ్గుతాయో? అనే విషయం ఈనాటికీ నా తర్కానికి అందలేదుమరి..!!!!  )

అలా మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మనం మన నమ్మకాలని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది సరైనదా? కాదా? దీనివల్ల నిజంగా మనకి ఒనగూరే ప్రయోజనం ఏమిటీ? అని.....

నమ్మకం కోసం ఏ పని చేసినా తప్పులేదు,కాని త్వరలో ఆ నమ్మకాన్ని దాటి దాని వెనుక ఉన్న
హేతువుని, ఉద్దేశాలను అర్ధం చేసుకుని ఆచరించేలా మన మానసిక స్థాయిని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి "

( ఎందుకు రాసావ్ ఇదంతా అంటే ఏం చెప్పను? భక్తి పేరిట పలాయనవాదాన్ని జనాలకి బోధిస్తున్న కపట వేషగాళ్ళను చూసి కోపంతో కొంత...ఏవో 4,5 గొప్ప మాటలు చెప్తూ,వినే వాళ్ళ మూర్ఖత్వాన్ని సమర్ధించేలా మాట్లాడగలనేర్పు ఉన్న వ్యక్తులను దైవాంశసంభూతులుగా భావిస్తూ  తమయొక్క సమస్తకష్టాలనూ ఆ వ్యక్తే తీరుస్తాడని భావించి ఆ వ్యక్తులు చెప్పిన క్రియలేవో చేసి తాము అనుకున్న ఫలితం జరిగితే " అదంత లీల " అని అన్వయించుకుని సంతృప్తి పడుతూ,,జరగకపోతే " మన ప్రారబ్దం,,కర్మా ఇంతే కాబోల్సు " అని సమాధానపర్చుకుని సర్దుకుపోతూ తామేం నష్టపోతున్నామో కూడా తెలియనంత అజ్ఞానంలో ,,తెలిసీతెలియనితనంలో ఉన్న కొందరు సామాన్య జనాల అమాయకత్వాన్ని చూసి జాలితోకొంత,,విసుగుతో మరికొంత ఇలా రాయాలనిపించింది ఎందుకో... )

స్వస్తి _/\_

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి