26 మార్చి, 2016

మితిమీరిన సాంకేతికత యొక్క దుష్పరిణామాలు



చాటింగ్...చాటింగ్..చాటింగ్....

కొందరికిదే వ్యాపకం తెల్లారి లేచిన లగాయతు రాత్రి నిద్రించేంత వరకూ....అసలంతంతసేపు ఏం చాటింగ్ చేసుకుంటారో...!!! అంత అర్జంట్గా డిస్కస్ చేసేసుకోదగిన మాటలు మనుష్యులమధ్య ఏం ఉంటాయో...!!! అని ఎంత ఆలోచించినా అర్ధంకాదు నాకు....

************************************************************************

సాంకేతికత పుణ్యమా అని ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోనులు వచ్చేసి సమాచారపంపకం అనేది వేగవంతమైంది నిజమే,,అభినందించదగ్గ విషయమే ఇది.....కానీ సామాజిక ఒంతరితనం కూడా ఎక్కువవుతోంది వీటివల్ల....

బస్ స్టాపులలోనూ,,బస్సులలోనూ,,,రైళ్ళ ప్రయాణాలలోనూ మీరు బాగా అబ్జర్వ్ చెయ్యండి....ప్రతీ ఒక్కరూ తమ రెండు చెవులలోనూ ఇయర్ఫోన్లు దోపేసుకుని కుడిచేతి వేళ్ళను ఫోన్ కీపాడ్పై ఆడిస్తూ అక్కడలేని మరో వ్యక్తికి మెసేజులు పంపుకుంటూ తమలో తాము నవ్వేసుకుంటూ మిగతా ప్రపంచమేది పట్టనట్లు బిహేవ్ చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువగా చాలామంది మనుష్యులు....

తెలిసిన వ్యక్తులతో అలా కాంటాక్ట్లో ఉండడం తప్పననుకానీ ముక్కూమొహం తెలియని ఫేస్బుక్ ఫ్రెండ్స్తో కూడా అలా అంతంతసేపు చాటింగ్లు చేస్తూ సంతోషపడడం మాత్రం సమర్ధనీయ ప్రవర్తన కాదు మరి.... 

ఫేస్బుక్లద్వారా,,ట్విట్టర్ల ద్వారా చేసే ఇటువంటి స్నేహాలు స్నేహాలేకాదు,,ఒట్టి కాలక్షేపాలు మాత్రమే..అంతే....!!! వాటికోసం అంతంతసేపు  సమయాన్ని వెచ్చిస్తూ  వృధా చేసుకోవడం అనవసరం....

(అవతలి వ్యక్తి ఎలా ఉంటారో కూడా తెలియకుండానే వాళ్ళతో అస్తమానూ ఆత్మీయంగా కబుర్లు చెప్పడం,,తమ ఈ స్నేహం యొక్క అంతిమ గమ్యం ఏమిటోకూడా విశ్లేషించుకోకుండా రాత్రీ,,పగలూ అదేపనిగా తరచూ అవతలి వ్యక్తితో చాటింగ్ చేస్తూ ఉండడం,,అవతలి వ్యక్తి నుంచి మెసేజ్ రావడం లేట్ అయితే ఏదో మిస్స్ అయినట్లు మనసు అదే పనిగా పీక్కోవడం,,ఈ ఈ చాటింగ్లకోసమని నిద్రని నిర్లక్షం చెయ్యడం ఇలాంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి మా యువతరంలో ప్రస్తుతం....

" లిమిట్గా ఉంటే పర్వాలేదుకానీ  మితిమీరితే చాలా ప్రమాదం ఇటువంటి వర్చువల్ స్నేహాలు " అని మానసికనిపుణులుసైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటిగురించి...తల్లితండ్రులకి తెలిస్తే తిడతారని వాళ్ళు పడుక్కున్నాక అర్ధరాత్రుళ్ళు పిల్లలు దుప్పటిముసుగులో చాటింగ్ చేస్తూ తమ నిద్రనీ,,ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని ,,ఆఖరికి మరుగుదొడ్డిలోసైతం ఫోన్ వాడేవారి సంఖ్య పెరుగుతోందని ఒకనొక సర్వేలో తేలింది ఈమధ్య....

" బాబోయ్ అంత దారుణంగా ఉందా పరిస్థితి??? " అని అనిపించి రాశానిలా )

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి