శిశిర కాలపు ఈ బంగారు రంగు ఎండ ఎంత బాగుందో ఇప్పుడు...
ఎముకలు నొప్పి పుట్టేంతగా బాధకలిగించిన ఉదయపు చలికి ఉపశమనంగా ఇప్పుడిప్పుడే నునివెచ్చని కిరణాలద్వారా లోకానికి మేలుచేస్తూ కమలాప్తుడు తన వెలుగు రేఖలను విప్పి పొలాలపై బంగారపుపొడిని చల్లుతున్నాడు...
జూన్ నెలలో అరకులోయలో విరగబూసే వెలిస పూలను ఇక్కడ విరివిగా పెంచుతున్నారా మా ఊరి రైతులు? అని ఆశ్చర్యం కలుగుతోంది ఈ ఎండలో పచ్చగా,,అందంగా మెరిసిపోతున్న జనుముపూలను చూస్తుంటే....!!!
శుభోదయం :)
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి