" 100 అబద్దాలు ఆడైనాసరే ఒక పెళ్ళి చెయ్యాలి " అని అంటూ ఉంటారు మన పెద్దలు...
కానీ అబద్దాల వల్ల ఆ బంధం ఎంతో కాలం సంతోషంగా ఉండదు,,, అలా అని పూర్తిగా నిజాలు చెప్తూ నిజాయతీగా ఉంటే ముందే సంతోషం ఆవిరైపోతుంది...
అప్పుడప్పుడూ అబద్దాలు కూడా ఆడాలి అవతలవారిని సంతోషపెట్టడానికి...
మనం ఆడేది అబద్ధం అని అవతలివారికి అర్ధమైనా వాళ్ళు చాలా సంతోషిస్తారు " అబద్దం ఆడినందుకు కాదు,,ఎలా అబద్దం చెప్తే తనకి నచ్చుతుందో తెలుసుకుని అలా చెప్పినందుకు "
కాబట్టి ఎప్పుడు నిజం చెప్పాలి,ఎప్పుడు అబద్దం చెప్పాలి అనే విషయం గుర్తెరిగి లౌక్యంగా ఉండడం వల్ల బంధంలొ ఎక్కువ కాలం సంతోషం ఉంటుందని నా అభిప్రాయం.
ఏమంటారు?
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి