" మగవాడిప్రేమ కామంతో నిండి ఉంటుందనుకుంటారు చాలామంది." అది చాలా తప్పుడు అభిప్రాయం. మగవాడి ప్రేమ నిజానికి ఎంతో కొంత అసూయతో నిండి ఉంటుంది...
" ప్రేమ ఉన్నచోట అసూయ ఉండదు " అని అంటారు కొందరు. అది బహుశా ఏ అమ్మాయినీ ప్రేమించనివాడో లేక నాలాంటి నిష్కామకర్మయోగో సృష్టించిన మాట అయ్యుంటుంది... పట్టించుకోకండి అటువంటి మాటలను.
ఇప్పుడంటే 21 ఏళ్ళు వచ్చేసి " జీవితంలో వ్యక్తిగత ప్రేమ అనేది ఓ చిన్న భాగం మాత్రమే,, జీవితాన్ని ప్రేమించడం, చక్కగా తీర్చిదిద్దుకోవడం ముఖ్యం " లాంటి స్టేటెమెంట్లు ఇచ్చేస్తాం కానీ,,, మన కౌమారపు ప్రారంభ దినాలు గుర్తు తెచ్చుకోండోసారి...
అంటే 13-17 వయసు మధ్యలో ఉన్న రోజులు. " నాకూ మీసం వచ్చేస్తోంది " అని అప్పుడప్పుడూ అద్దం ముందు చూసుకుని గర్వపడి మురిసిపోయే రోజులవి.
ఆకర్షణకి, ప్రేమకి తేడా ఏమిటో తెలియని రోజులవి..
కచ్చితంగా ఎవరో ఓ అమ్మాయి ఆకర్షణీయంగా అనిపిస్తుంది మనకి(నాలాంటి ఋష్యశృంగులకి తప్ప)...
ఆమె నవ్వు,, ఆమె ప్రతీ కదలిక ఏదో తెలియని వెర్రి ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది మన హృదయంలో...
తను " మన తెలివితేటలు,గొప్పదనం గుర్తించి మనమంటే చాలాగొప్ప " అనే అభిప్రాయం ఏర్పరుచుకోవాలని తెలియకుండానే ఆశించే రోజులవి....
కలల్లో, ఊహల్లో ఆమె గురించి ఏవేవో అందమైన ఆలోచనలు,,మనకప్పుడు భావుకత్వం, కవిత్వంలేకపోయినా సరే... ( కొందరు అబ్బాయిలు ఐతే " మాకు పెళ్ళి అయ్యాక అబ్బాయి పుడితే ఈ పేరు, అమ్మాయి పుడితే ఈ పేరు అని ఇప్పటినుంచే నిశ్చయించేస్తూ ఉంటారు కూడా.....!!! )
ఆమె మాటలు,ఆమె నవ్వు,ఆమె స్నేహం అన్నీ మనకే దక్కాలని,మనకోసమే అయ్యుండాలని తీవ్రంగా కోరుకుంటాము...
అలాంటి సమయాలలోనే నక్షత్రకుడిలా ఎక్కడనుంచీ ఊడిపడతాడో కానీ ఎవడో ఓ దుర్మార్గుడు (ఆ వయసులో వాడు మనకి అలానే కనపడతాడు మరి) వస్తాడు.....మనం ఇష్టపడే అమ్మాయితో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉంటాడు.......
వాడిని అస్తమానూ చూస్తే ఒళ్ళు మంట మనకి. " అయినా వాడు ఆ అమ్మాయికి ఏ సోదరుడి వరసో అయ్యుంటాడు, లేకపోతే ఆమె అలా మాట్లాడుతుందా వాడితో " అని అనుకోకపోతేకానీ శాంతిలేదు మన హృదయాలకి అప్పట్లో.......!!!
వాడు నవ్వుతూ తుళ్ళుతూ కాకుండా ఇంకా ఎక్కువగా ఏమైనా ఎగస్ట్రాగా ప్రవర్తిస్తూ ఉంటే మన హృదయం భగ్గుమంటుంది....
" వాడిని ఒంటరిగా దొరికినప్పుడు కుమ్మేద్దామా? లేక గుంపుగా మనోళ్ళందరినీ తీసుకెళ్ళి కుమ్మేద్దామా? " అని ఎందుకాలోచిస్తాం అప్పుడు???
మగవాడి ప్రేమంటే అంతే మరి.... అసూయతో అలానే ఉంటుంది మరి....
గమనిక:- మగవాడి ప్రేమ అసూయతో నిండి ఉంటుంది కదా? అని నీకు ఆ అమ్మాయి దక్కకపోతే ఆ అమ్మాయిని చంపెయ్యడం, యాసిడ్ దాడులు చెయ్యడం అవి సరి కాదు..అదసలు ప్రేమే కాదు. పైశాచికత్వం.
నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్ళి జరిగిందా? నీఅంత అదృష్టవంతుడెవడూ లేడు ఈ భూప్రపంచంలో అని సన్మానాలు సత్కారాలు జరిపించుకునే ఏర్పాట్లు చేసుకో...
దక్కలేదా? ఇంకా మంచిది...జీవితంలో సాదించాల్సింది ఎంతో ఉంది కదా???
నిజంగా ప్రేమ కలిగి ఉంటే ఆ అమ్మాయి ఎందుకు??? ఆ అమ్మాయి జ్ఞాపకాలు చాలుగా???వాటితో నీ జీవితాన్ని ఆనందంగా గడిపే డ్యూడ్...
అంతే...ఇక చెప్పేందుకేం లేదు..
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి