10 అక్టోబర్, 2017

Relation లో ఉన్నప్పుడు పాటించాల్సిన కొన్ని Basic Rules

మన ముందు తరాలతో పోలిస్తే ఇప్పుడు చాలామంది స్త్రీలు కేవలం ఇంటికే పరిమితమైపోకుండా చక్కగా చదువుకొని,, మంచి ఉద్యోగాలు చేస్తూ అందులో పెద్ద పెద్ద హోదాలను అనుభవిస్తూ తమ లైఫ్ని తామే Own గా లీడ్ చేసుకొనే స్థితిలో ఉంటున్నారు కదా ప్రస్తుతం ? మరలా ఉన్న స్త్రీ సాంప్రదాయాన్ని అనుసరించి వివాహం చేసుకొని మీ ఇంటికొచ్చి నీతో లైఫ్ గడపడానికి సిద్ధపడుతోందంటే అది ఎందుకై ఉంటుందోనని ఎప్పుడైనా ఆలోచించావా రా అబ్బాయ్ నువ్వసలు?


ఆమెకి ఆర్ధికపరమైన అండగా నువ్వు ఉంటావనా? ఇది ఒకప్పటి కాలంలో చెల్లిన మాటేమోకానీ ఇప్పుడు కాదుగా? ఎందుకంటే తనకి తాను సంపాదించుకొని ఎవరి అండా లేకుండా తన జీవితాన్ని తానే నిర్వహించుకోగలిగే స్థితిలోనే ఉంటోందిగా ఆధునిక మహిళ ఉద్యోగం చెయ్యడం వల్ల ప్రస్తుతం. కనుక ఇది కారణమై ఉండదు,, మరింకెందుకంటావ్?


శారీరకసుఖం కోసం అనుకొంటున్నావా? అదే కావాల్సివస్తే నిన్నొక్కడినే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? నువ్వేమైన పెద్ద పోటుగాడివని తెలిసి వస్తోందా ఏమిటి? కాదుగా? పైగా అదే కావాల్సివస్తే నీ ఒక్కడితోనే ఎందుకు పరిమితమై ఉండాలనుకొంటుంది చెప్పు?


పిల్లలకోసమనా? పిల్లలే కావాల్సి వస్తే అనాధశరణాలయం నుంచి ఓ బాబునో పాపనో తెచ్చుకోవచ్చు... పైగా సరోగసీ లాంటి పద్ధతులు ద్వారా కూడా మగవాడి ప్రమేయం లేకుండానే పిల్లలను తాను పొందగలదు? మరింకెందుకు ఆమె నిన్ను పెళ్ళి చేసుకొంటోందంటావ్?


గట్టిగా ఈ ప్రశ్నలన్నీ తననే నువ్వడిగితే తాను కూడా సమాధానం చెప్పలేదేమో సరిగా,, " ఏమో అవేమీ నాకు తెలీదు,, నీతో లైఫ్ పంచుకొంటే నేను ఆనందంగానూ,, సంతోషంగానూ ఉంటాననే నమ్మకంతో నిన్ను చేసుకొన్నానని " అంటుందేమో బహుశా...!!!


మరి అలా అన్న ఆ స్త్రీతో నువ్వెలా ప్రవర్తిస్తే ఆమెకలా ఆనందం ,, సంతోషం కలుగుతుందని ఎప్పుడైనా యోచించావా నువ్వుసలు? ఆలోచించకపోతే కనుక కొన్ని విషయాలు చెప్తాను నేను,, కాస్త ఓపికగా చదువు..


మొట్టమొదటిగా ఆమెని ఆమెలా గుర్తించి గౌరవించడం నేర్చుకో.. అంటే ఆమెకీ రకరకాల ఎమోషన్స్, ఇష్టాలూ,, అభిరుచులు , సొంత అభిప్రాయాలూంటాయని గుర్తించి అందుకు తగ్గట్లు వాటికి విలువనిచ్చి ప్రవర్తించడం నేర్చుకో... ఇది కేవలం ఒక్క భార్యకనే కాదు,, ఏ స్త్రీ అయినా మొగవాడినుండి ఇంతకుమించి కోరుకునేది ఏదీ ఉండదు నిజానికి...


2. మీ ఇద్దరికీ కామన్ గా ఉన్న విషయాలను కలిసి ఆనందించడం నేర్చుకో,, లేనివాటికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో....


3. నిజానికి స్త్రీ అయినా పురుషుడైనా పెళ్ళి చేసుకొనేది వాళ్ళకంటూ జీవితంలో అన్నివేళలా ఫిజికల్లీ,, ఎమోషనల్లీ సపోర్టివ్గా ఒకరుండాలని.. అది ఒకే జెండర్ అయిన వ్యక్తి నుంచైతే అయితే స్నేహం అవుతుంది,, వేరే జెండర్ అయితే అది బంధమవుతుందని అలా పెళ్ళి చేసుకొంటారు.. మరి బంధమన్నాక బోలెడు బాధ్యతలు ఉంటాయి కదా?? ఆ బాధ్యతలు ఒకరికొకరు పరస్పర అవగాహనతో పంచుకొని సరిగ్గా నిర్వహించుకుంటూ ఒకటిగా లైఫ్ని లీడ్ చేసుకుందామనే ఉద్దేశంతోనే ఏ జంటైనా పెళ్ళి ద్వారా ఒకటయ్యేది.. కనుక నీ మటుకు నువ్వు నీ బాధ్యతలయందు నిర్లక్షవైఖరిని ప్రదర్శించకు


4. నీకుగానీ ఆమెకిగానీ బోలెడుమంది స్నేహితులూ, పరిచయస్తులూ ఉండవచ్చు.. ఆఖరికి తల్లీ తండ్రీ తమ్ముడూ అక్కా చెల్లీ అనే ఎన్నో రిలేషన్స్ ఉన్నా భాగస్వామి దగ్గర ఓపెన్ అయినట్లుగా మిగతా ప్రపంచం దగ్గర ఓపెనప్ అవ్వగలరా నువ్వైనా , ఆమైనా? కనుక ఆనందమైనా ,, విషాదమైనా ఆమెతో పంచుకోవడం,, అలానే ఆమెనూ వినడం అలవాటు చేసుకో.. 


కెరీర్, కలలు, స్నేహితులూ, లక్ష్యాల గురించి నీ భాగస్వామి నీకు చెపుతున్నప్పుడు విసుగ్గా మొహం పెట్టడం, అనాశక్తి ప్రదర్శించడం సరికాదు.. దానివలన నీ భాగస్వామి వేరొకరితో ఈ విషయాలను పంచుకొనే దుస్థితి ఎదురవుతుంది,, ఆలోచించుకో...


( ఈ నాలుగు సూచనలూ చదివాక ఇవి కేవలం మగవాళ్ళకే చెప్పడమేమిటి ? మరి ఆడవాళ్ళకేమీ చెప్పవా? " రిలేషన్లో వాళ్ళెప్పుడూ చాలా కరక్ట్గా బిహేవ్ చేస్తారు, మగవాడే తప్పుగా బిహేవ్ చేస్తాడు " అనే ఉద్దేశంతో నువ్వు ఈ వ్యాసం రాసినట్లుంది,, ఏం మన మొగవాళ్ళలో కూడా బాగా చూసుకునేవాళ్ళు లేరా? అని నాపై ఈ వ్యాసం అంతా చదివాక ఎగురుదామని అనుకొంటున్నావా కామెంట్స్లో ? కంగారు పడకు.. 


ప్రారంభంలో అడిగిన ప్రశ్నలు చదివిన నిన్ను ఈ వ్యాసం చదివేందుకు ఆకర్షించేలా చేసి నీ ఆలోచనాపరిధిని విస్తృతపరిచేందుకు నేనుపయోగించిన ట్రిక్ అంతే...!!! చదివి, ఆలోచించి తన జీవితానికి అన్వయించుకోగలిగితే ఆమెకూ ఇవి పనికొచ్చే విషయాలేగా? కనుక ఇది ఇద్దరికీ సంబంధించిన వ్యాసమే...


ఇది రాసాక నాకిప్పుడు అనిపిస్తోందేంటంటే ఇవి భార్యాభర్తలమధ్య బంధం బాగుండేందుకు పునాదిగా ఉండాల్సిన బేసిక్ విషయాలని... అయితే జీవితంలో ఉండే అనేకమైన దశలలో,, ఎదురయ్యే రకరకాల పరిస్థితులలో ఒకరిపట్ల మరొకరు ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించకూడదనే విషయాలు ఇంకాస్త వివరంగా వివరిస్తే బాగుండునని అనిపిస్తోందిప్పుడు నాకిప్పుడు ఇదంతా రాసాక. అయితే వ్యాస విస్తారభీతిచే ఇక్కడితో వదిలిపెడుతున్నాను ప్రస్తుతానికింతవరకూ... నాకు కాస్త ఖాళీ దొరికినప్పుడెప్పుడైనా మరోసారి రాస్తాలే ఆ వ్యాసాన్ని ,, 


అంతలోపులో నేను చెప్పిన ఈ విషయాల గురించి కాస్తైనా ఆలోచించి చూడు ,, కొద్దిగానైనా నీ దృక్పథంలో మార్పొస్తే అంతకన్నా నాక్కావాల్సిందేముంటుంది చెప్పు నిజానికి ?? )

శుభరాత్రి :)


- Kks Kiran

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి