31 అక్టోబర్, 2016

భక్తంటే?


" భక్తి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే " అంటారు శంకరాచార్యులు తన వివేకచూడామణిలో...

కానీ ప్రస్తుతకాలంలో " పక్కవాడు ఏది చెస్తే దానిని మరో ఆలోచన లేకుండా అనుకరించడమే " భక్తిలా తయారయ్యింది దురదృష్టవశాత్తూ మన వ్యవస్థలో...

ఊరికే రాయట్లేదు నేనీమాటలని...

చాలామంది ఇప్పుడు భవాని దీక్షలు వేస్తున్నారు కదా??? వాళ్ళళ్ళో కొందరి అజ్ఞానపు,,మూర్ఖత్వపు ప్రవర్తనలు చూసి విసుగెత్తిపోయి నేనీ మాటలు రాస్తున్నాను ఇలా...

వీళ్ళల్లో చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళల్లా తమ కాళ్ళకి పట్టీలు పెట్టుకోవడం,,ముక్కుపుడక తగిలించుకోవడం,,చేతులకి గాజులు తొడుక్కోవడం,,ముఖం నిండా వీపుల నిండా పసుపు పులిమేసుకుని అర్ధరూపాయి కాసంత కుంకుమ బొట్టులు ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లు ఒళ్ళంతా పులిమేసుకోవడం చేస్తున్నారు...ఈ మూర్ఖత్వానికి పరాకాష్ట ఏమిటంటే వీళ్ళళ్ళో కొందరు మెడలో తాళిబొట్లు,,కాళ్ళకి చుట్లూ వేసుకుంటున్నారు కూడా... 

స్త్రీకై ఉద్దేశించిన ఈ ధర్మాలని మీరు అమలు చెయ్యడమేమిట్రా నాయనా? అయినా భక్తి ఉంటే అమ్మవారి తత్వాన్ని సాధన చెయ్యాలికానీ ఆమె రూపాన్ని ఊరికినే ఇలా అనుకరిస్తే ఏమొస్తుందిరా బాబూ???

ఆలోచించండి ఓసారి...!!!

అలాగే రాత్రి 11 గంటలవరకూ పెద్ద శబ్దం కలిగించే మైక్లు పెట్టి భజనలు, గోలగా అనిపించే పాటలు పెడుతున్నారు ప్రతీరోజూ ( అవీ ఎలాంటివి అనుకుంటున్నారు?? సినిమాలలో సూపర్ హిట్ అయిన పాటల ట్యూన్స్ని లిరిక్స్ మార్చి పాడడం -- కెవ్వుకేక,,సూపర్ మాచ్చి లాంటి మసాలా పాటల ట్యూన్స్నికూడా కూడా భక్తి పాటలలా మార్చేసి కర్ణకఠోరమైన శృతితో,గార్ధభ స్వరంతో పాడడం చేస్తున్నారు వీళ్ళు )...ఇది భక్తి అనాలా ? పిచ్చి అనాలా? ఎందుకంటే భక్తుంటే వాటిని ఇతరులు ఇబ్బందిపండేంత స్థాయిలో ప్రదర్శించక్కర్లేదు మరి... 

అయినా ప్రార్ధనా,,భక్తీ అనేవి నిజానికి ఆంతరంగిక విషయాలు కదూ?? వీటి ద్వారా మానసిక మౌనస్థితిని అప్పుడప్పుడైనా పొందగలగడం,,తద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని అస్వాదించడం - దానితో ఈ ప్రపంచాన్ని సమదృష్టితో చూస్తూ సర్వ ప్రాణులపట్లా దయా భావాన్నీ,, ప్రేమ భావాన్ని పెంచుకోగలగడం జరగాలి..

అదీ ఆధ్యాత్మికత అంటే..

వాటిని వదిలేసి ఈ శుష్కప్రదర్శనలు చేస్తే ఏమిరా ఉపయోగమూ???

కొద్దిగా అయినా ఆలోచించండి కాస్త బుర్రపెట్టి.. 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి