25 ఆగస్టు, 2016

ఆలోచించాల్సిన విషయమే

కార్ల్ మార్క్స్ అనుకుంట ఈ స్టేట్మెంట్ ఇచ్చినది.... 

" ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు కేవలం 5 శాతం మందే ఉంటారు...వీళ్ళలోనే శాస్త్రవేత్తలుంటారు,రాజకీయనాయకులుంటారు,కళాకారులుంటారు,మతాధికారులుంటారు,వైద్యులుంటారు,వేదాంతులుంటారు,,వ్యాపారవేత్తలుంటారు. అలాగే వివిధ వ్యవస్థలని నడిపే ప్రముఖులుంటారు... మిగతా 95 మంది శాతం ప్రజలూ సామాన్యులే,, వాళ్ళు వీళ్ళచే ప్రభావితులై తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు " అని...

ఆలోచిస్తే చాలా నిజంగా తోచే విషయమే ఇది...

విషయపరిధి ఎక్కువలేని వాడు విషయజ్ఞానిపై ఆధారపడాల్సిందే ఈ ప్రపంచంలో ఎప్పుడూనూ,, లేకపోతే ప్రపంచం సరిగ్గా నడవదుకూడా..

అయితే దురదృష్టవశాత్తూ తెలివైనవాడు తన తెలివితేటలని వ్యవస్థని ఉద్దరించడానికైకాకుండా తెలివితక్కువవాడిని దోచుకోడానికి ఉపయోగిస్తున్నాడు ప్రస్తుతం ప్రపంచంలోని ఏ రంగంలో చూసినా... సామాన్యుని నమ్మకాలూ,కోరికలని,బలహీనతలనీ ఆసరాగా చేసుకుంటూ తెలివైనవాడు తాను అందలం ఎక్కుతున్నాడు వీడిని క్రిందకి నెడుతూ...

అలా గెలవడం తప్పేమీ కాదంటుంది కాప్టలిస్ట్ వ్యవస్థ.. అలా గెలిచే గెలుపు అసలు గెలుపే కాదంటారు కమ్యూనిస్ట్లు...

ఇందులో ఏ వాదం నిజం? అంటే ఏదీ సరైన వాదంలా అనిపించదు నిజానికి,, దేని లోపాలు దానికై ఉన్నట్లు తోస్తుంది మనకి...

కానీ ఇక్కడ చర్చించదగ్గ ప్రశ్నలేంటంటే ' తెలివైనవాడు తన మేధావితనంతో సామాన్యుల మూర్ఖత్వంపై ఆడుకోవడం ఎంత వరకూ కరక్ట్? సామాన్యుడు అలా మోసపోయేలా తన ప్రవర్తనని ఉంచుకోవడం ఎంత వరకూ సమర్ధనీయం ? " అని...

( ఈ ప్రశ్నలకి పరిష్కార మార్గం దొరికితే ఏ వ్యవస్థ అయినా బానే ఉంటుంది నిజానికి ) 

ఈ ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పలేక వాస్తవికవాదులు ఒకటే అంటారు

" మనుష్యులు ఒకళ్ళనొకరు ఆమాత్రం మోసం చేసుకోకుండా ఉంటే ప్రపంచపు మనుగడ అసాధ్యం " అని...

ఏమంటారు?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి