07 జులై, 2016

మతం ఎందుకు?



" మతం ఎందుకు? మతం లేకుండా మనిషి జీవించలేడా? అసలు మనిషికి మతం అవసరమేనా? " ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలా ఇబ్బంది పెడ్తూ ఉంటాయి అప్పుడప్పుడూ.

" మనిషియొక్క జీవిత విధానాన్ని కొన్ని పద్దతులూ,సమాజం బలవంతంగా నిర్ణయించడాన్ని కొంతవరకూ నేను వ్యతిరేకిస్తాను...మనిషి సంపూర్ణ మానసిక స్వేచ్చతో బ్రతకాలని కలలుకనే వ్యక్తులోలో నేనూ ఒకడిని...అయితే మతంలోని కొన్ని పద్ధతులు,,కొన్ని క్రియలు మనిషిని మనిషిలా బ్రతకనీయవు.మనిషి జీవితాన్ని కొన్ని పీల్చిపిప్పి చేసేసినా మనిషి వాటిని కాదనలేని ఓ నిస్సహాయస్థితిలో వాటికి లొంగిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను నేను.ఇదిగో అలాంటప్పుడే ఈ ప్రశ్నలు నన్ను వేధిస్తాయి.మనిషికి మతం ఎందుకు? మనిషి మనిషిలా బ్రతకలేడా? అని.

ఆలోచిస్తే మతం ఉద్భవించడానికి కారణాలు చాలా గొప్పవిగానే తోస్తాయి...మనిషి యొక్క మంచి మనుగడే మతం యొక్క అభిమతం." మనమేదో అనుకుంటాం మనుష్యులందరూ ఒకటే,సమానులు " అని.కానీ నిజానికి మనుషుల్లో చాలామంది మానసికంగా బలహీనులు,,కాస్తలో కాస్త జీవితంపై ఓ అవగాహనా,,ఆలోచనా లేని వాళ్ళు ఉంటారు.అలాంటివాళ్ళకి మతం నిజంగా చాలా ఉపకారం చేస్తోంది...!!! పాపం,పుణ్యం,స్వర్గం,నరకం అనే భావనలు,భయాలు నింపి వారిని నైతికంగా చెడిపోకుండా ఓ ఆరోగ్యకరమైన జీవన విధానాన్నీ,ఒకరకంగా సామాజిక చైతన్యాన్నీ,చక్కటి వ్యవస్థనీ ఏర్పరుస్తోంది....

ఇంత వరకూ అయితే బానే ఉందికానీ మతం అనేది మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తోంది... " నేను చెప్తున్నాను కాబట్టి నమ్మి ఈ విధానాలు పాటించితీరాలి " అని బలవంతంగా మనిషి జీవనవిధానాలను శాసిస్తోంది...

" కాదు ఈ విధానాలు అర్ధంలేనివి అనో లేక  నాకు నమ్మకంలేదు ఈ విషయాలపట్ల అనో,,అసలు అంతరార్ధాలన్నీ ఎప్పుడో ఎగిరిపోయాయి--ఉత్త క్రియలే మిగిలాయిప్పుడు,,ఈ క్రియలకి ఇంత ఇంత ధనాన్నీ,,కాలాన్ని వ్యర్ధపరుచుకోవడం అనవసరం " అని ఎవరైనా వ్యతిరేకిస్తే గొప్ప శత్రువు అయిపోతాడు ఇక ఆ మతస్తులకి...అయితే వాడిని బలవంతంగా తమ దారికి తెచ్చేసుకోవాలని ప్రయత్నించడమో,,లేక భౌతిక దాడులుచెయ్యడమో చేస్తున్నాయి కొన్ని మతతత్వశక్తులు...అంతేకానీ అలా వ్యతిరేకించిన వ్యక్తి వ్యాఖ్యలలో నిజమెంతో...!!!  అని కూడా ఆలోచించరు....

మతం వల్ల మనిషి ఆలోచనాపరుడు అవ్వాలికానీ  ఆవేశపరుడు అవుతున్నాడు...ఈ కాలంలో మతం అంటే ఓ సామాజిక ఉద్రేకంలా తయారయ్యిందంతే...!!! అది కాదని,,అసలు మతం ఎందుకు? ఏ విధంగా మనిషికి అది ఉపయోగపడాలో చలం ఎంత బాగా చెప్పాడో చూడండి.

" మతమంటే మనసుకి కలిగే గొప్ప
సందేహాలు తీర్చాలి,మన జీవనానికి
నమ్మకానికి
సమన్వయము కుదిరించాలి.

లోకంలో కొత్త
సమస్యలు బయలు దేరితే వాటిని
అర్థం చెయ్యాలి. నుతనోస్థం ఇవ్వాలి
జీవించడానికి.

అంతే కాని ఏదో
నేను చెపుతున్నాను , నమ్ము.
నమ్మితే మోక్షం ,, నమ్మక పోతే నరకం..
నా పని పరలోకం ఈ లోకంతో పని లేదు అనే
మతం ఎందుకు పనికి రాని మతం.. " అని.

మీరేమంటారు ?

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి