24 జులై, 2016

వర్షాకాలపు అందం



మూడు రోజులనుంచీ  వర్షపు వాతావరణం  నెలకొని ఉంది వూళ్ళో...

వాన ఎప్పుడొస్తుందో తెలియదు,, ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో అర్ధంకాదు... 

అటుఇటూ కదులుతూ మధ్యమధ్యలో కొంతసేపు వర్షాన్ని కురిపించి కదిలిపోయే మేఘాలు ఎక్కువగా సంచారం చేస్తున్నాయి ఆకాశంలో... కురిసిన ఆ కొద్దిపాటి వర్షమూ రాసుసిరి కొమ్మలకి ముత్యాలరాసులను అలంకరించి చక్కాపోతోంది..

వర్షం వెలిశాక బలమైన ఊదురుగాలులు వచ్చి మొక్కలకి, చెట్లకి పూనకాలని తెప్పించి పారిపోతున్నాయి...నిండుకుండలైపోయిన చెరువుల మీదనుంచి ఆ గాలి బలంగా వీచినప్పుడల్లా అందులోని నీరు గట్టువారన నిల్చున్న మనుష్యుల మొఖాల మీదకి తుంపరలరూపంలో చిమ్మికొడుతోంది చాలా గట్టిగానే ...

బయట వాతావరణాన్ని చూసి " సరే వర్షం తగ్గిందికదా...!!!  అలా బయటకెళ్ళి మొక్కజొన్న పొలాలని చూసొద్దాం " అని అనుకుంటూంటే " దూరాన ఎక్కడో వర్షం పడుతోంది " అని సంకేతాన్ని ఇస్తున్నట్లు వర్షపుహోరు తెగ వినిపించి ఆ ప్రయత్నాన్ని విరమింపచేస్తోంది..

" వాన ఇప్పుడప్పుడే పడదులే ,, ఇక బయట మన పనులు చక్కపెట్టుకుందాం " అని ఆత్రపడే మనుష్యులని ఈ వర్షం బాగా ఏడిపించుకుతింటోంది హఠాత్తుగా తాను ప్రత్యక్షమై...

" ఎండ ఎంతున్నా తట్టుకోగలంకానీ ఈ వర్షం ఏంట్రా నాయనా, పనికి అడ్డూ చేటూ " అని విసుక్కుని వర్షాన్ని తిట్టిపోసేవాళ్ళు ఎక్కువైపోయారు జనాలలో గత 4 రోజులనుంచీ..
వీళ్ళను చూసి దేవుడిని ఒకటే ప్రార్దిస్తున్నాను నేను ఈమధ్య

" దేవుడా.... వీళ్ళందరినీ " భావుకత " అనే ప్రేమలో పడేయవయ్యా..

వర్షం విలువెంటో తెలుసుద్ది ;) " అని

శుభసాయంత్రం 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి