" తాగినప్పుడు మనిషి మృగంలా ప్రవర్తిస్తాడు " అని అంటూంటారు చాలామంది....
వాస్తవానికి అప్పుడే మనిషి వాడిలా ప్రవర్తిస్తాడనుకుంటున్నాను....
ఒళ్ళూపైనా తెలియని ఆ మైకపు సమయంలోనే వాడి తాలూకు అసంతృప్తులు,అణిచిపెట్టబడ్డ వాడి కోరికలూ,, జీవన విధానమూ,,,వాడి తాలూకు ద్వంద ప్రవృత్తి అన్నీ ఒక్కసారిగా బయల్పడడంతో అది చూసిన బయట వారికి చాలా చిత్రంగానూ,,భయానకంగానూ తోస్తుంది.....
మనం తాగుబోతులను తిట్టుకుంటామేగానీ ప్రతీ మనిషి యొక్క అంతర్ముఖమూ అంతో ఇంతో కాస్త ఇలానే భయంకరంగానే ఉంటుంది....
ఎటొచ్చి తాగుబోతులు తాగి ఇలా బయటపడతారు,,,మిగతా వాళ్ళు అలా దొరకకుండా జాగ్రత్తపడుతూ సమాజంలో మంచివాడిగా మన్ననలు పొందే ప్రయత్నాలలో నిమగ్నమై ఉంటారు....
అమ్మో...!!!!
ఎదుటి మనిషి మనసులో ఏముందో తెలుసుకునే శక్తే కనుక దేవుడు మనకిస్తే ఈ ప్రపంచాన్ని చూసి మనం వెంటనే ఆత్మహత్య చేసుకోవడం ఖాయం...
అంతలా మనిషి ప్రవృత్తి వికృతరూపు దాలుస్తోంది ప్రస్తుతం :(
ఏమంటారు దీనిపై?
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి