టెక్నాలజీ ఇంతలా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇంకా లేఖలేమిటనుకోవచ్చు మీరు... కానీ ఆలోచించండి,,ఈ చాటింగులు ఏం చేస్తున్నాయి? మన కాన్వర్జేషన్స్ని కాజువల్గా మార్చేస్తున్నాయి...కాల్స్ అక్కర్లేని విషయాలనీ,,ఊసుబోలు కబుర్లనీ కుమ్మరించేస్తూ బంధాలమధ్య అనుభూతులని,,ఆ ఆకర్షణనీ చాలా మామూలు విషయాలుగా చేసేస్తున్నాయి..
అందుకే నాకీ పద్దతి అంతగా నచ్చక చాలా తక్కువగా ఫోన్ కాల్స్కి ఆన్సర్ ఇస్తున్నాను నాకు తెలిసిన వ్యక్తులకైనా సరే...!!! సందర్భం వచ్చినప్పుడు ఇదిగో ఇలా నాకు బాగా ఇష్టమైన వ్యక్తులకి లేఖలు రాయడం అలవాటుగా చేసుకున్నాను నేను..
ఈ లేఖలు రాయడం ఒకసారి అలవాటు పడితే ఎంత బాగుంటుందో తెలుసా?? ఆ వ్యక్తితో మనకుండే అనుభూతులు,,అనుభవాలూ తల్చుకుంటూ ఆనందిస్తూ రాయడం అలవాటుపడితేకానీ అర్ధంకాదులెండి..వాస్తవానికి మనం రాసిన రాతలు అంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ అవతల వ్యక్తితో మనకుండే బంధం యొక్క గాఢతను చాలా నిజాయితీగా తెలియచేస్తాయి ఇవి. రాస్తున్నప్పుడు మనకీ,,చదివినప్పుడు ఆ అవతల వ్యక్తికీ చాలా ఆనందానీ,,సంతోషాన్నీ,,సంతృప్తినీ ఇవ్వగల గొప్ప ప్రక్రియ ఇది... అందుకే అస్సలొదులుకోవట్లేదు ఈ అవకాశాన్ని నేను సంధర్భం దొరికినప్పుడు..
అలా ఇప్పటివరకూ నేనూ మా పిన్ని కూతురికీ,,నా తమ్ముడికీ,,నా బాల్య స్నేహితురాలకీ మాత్రమే రాశాను,,ఇదిగో ఈ రోజు నాతోపాటు కాకినాడలో డిప్లమా చదువుకున్న నా ఆప్తమిత్రుడు మోహనాచారికి తన పుట్టిన రోజు సంధర్భంగా తాను నాకెంత ప్రత్యేకమో విశదీకరిస్తూ కొన్ని వాక్యాలతో ఓ లేఖ రాసి వ్యక్తిగతంగా అతనికి వాట్సాప్లో పంపాను..
ఆ లేఖ ఇదిగో
"" జీవితంలో కోట్లు సంపాదించినప్పుడు కలిగిన ఆనందం ఒక మంచి మితుడిని పొందినప్పుడు కలుగుతుంది " అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు @ చారిగారు..ఆ మాటలు బాగా గుర్తొచ్చాయండి నాకు ఇప్పుడు మీకిలా నేను ఉత్తరం రాస్తూంటే...
ఆలోచనలలో సారూప్యం వల్లనే స్నేహం మొదలవుతుందనీ,,దానివల్లే అది కలకాలం నిలుస్తుందనే అభిప్రాయాలతో ఇప్పటివరకూ నేనుండేవాడిని కానీ ఆలోచిస్తే మీకూ నాకు దగ్గరగా ఉన్న భావాలెన్ని? ఎంత భావ వైరుద్యం ఉందో కదా మన మన మధ్య ? మరి మన స్నేహం ఎట్లా మొదలైందంటారూ ఇంత చిత్రంగా? ఇంతకాలమూ ఎలా నిలిచి కొనసాగుతోందో మరి ??
నా సిద్ధాంతాలు నాకు సమాధానమివ్వలేని ప్రశ్నలలా నా ముందు నిలిచున్నాయి ఈ రెండు విషయాలూ ఇపుడు మీవల్ల...
మీతో స్నేహం మొదలై అప్పుడే ఎనిమిదేళ్ళు పూర్తి కావస్తోందా? అనే ఆశ్చర్యం కలుగుతోంది నాకిప్పుడు..ఏదో నిన్న మొన్నే మొదలైనట్లు చాలా తాజాగా అనిపిస్తోంది నాకిప్పటికీ మన స్నేహబంధం..
బహుశా నిజమైన స్నేహానికి గుర్తు కాలమేనేమో...
ఆ కాలమే మళ్ళీ మీకిలా ఇంకో ఏడాది సంవత్సరాన్ని ఇచ్చి కొత్త అనుభూతులూ,,అనుభవాలూ పొందరా అని దీవిస్తోంది కనుక ఆ కాలంతో పాటుగా నేనూ మిమ్మలని ఆశీర్వదిస్తూ చెప్తున్నాను మీకీ మాటలు
" పుట్టినరోజు శుభాకాంక్షలు "
మీ జీవితం మీకు నచ్చేలా,,మీరు మెచ్చేలా ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
- Kks Kiran ""

ఎలా ఉందిది?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి