24 మార్చి, 2016


" ఏదైనా ఒక విషయంపై కొంచం పరిజ్ఞానం ఉంటే అది మనలో ప్రశ్నలు రేకెత్తించి సమాధానాలు దొరికేంతవరకూ కుదురుగా ఉండనియ్యదు " అనే విషయం నాకు ఒక సంఘటన ద్వారా తెలిసింది.

ఈ శివరాత్రికి నేను " పట్టిసం " అనే ఊరికి వెళ్ళాను ఈశ్వరదర్శనం కొరకు,శివాలయంలో దర్శనం అయ్యాక అదే ఆవరణలో ఉన్న " భావనారాయణ స్వామి " గుడికి కూడా వెళ్ళాను,

అక్కడ పూజారిని ఏదో న్యూస్ చానల్ వారు ఇంటర్యూ చేస్తున్నారు ఈ క్షేత్ర మహత్యం చెప్పండి అని,

ఆయన " ఈ ఊరికి 5 కి.మీ దూరంలో ఏనుగుకొండ అనే ఊరు ఉంది,అక్కడ 1000 ఎకరాల విస్తీర్ణం గల ఒక పెద్ద చెరువు ఉంది,అక్కడే " గజేంద్రమోక్షం " సంఘటన జరిగింది.ఆ ఘటన అయ్యాకా స్వామివారు ఇక్కడ వెలిసారు " అని చెప్పారు ఆ పూజారి గారు.

నాకు వెంటనే గజేంద్రమోక్షంలోని ఈ పద్యం గుర్తుకువచ్చింది.

" సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై "

అంటే ఆ ఏనుగుని కాపాడడానికి శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నడో,శంఖచక్రాలను తీసుకుపోలేదు,ఇలా ఇలా ఉంటుంది కదా ఆ పద్యపు అర్దం,

మరి ఇక్కడ ఏంటి ఈ విగ్రహానికి శంఖచక్రం ఉన్నాయి ,రెండిటికి పోలిక కుదరటల్లేదే ? అని ఒక సందేహం కలిగింది వెంటనే,

ఒక్క నిముషం ఆ సందేహంతో కొట్తుమిట్టులాడాను అలా,

బయటకి వచ్చేసాక వెంటనే మిగిలిన పద్యాలు గుర్తుచేసుకున్నాను,

అప్పుడు గుర్తుకువచ్చింది ఈ పద్యం ,

" తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్ వాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్ "

అంటే ఆ గజరాజు పిలుపు విని త్వరత్వరగా కాపాడదామని వెళ్ళిన నారాయణుడు వెంట లక్ష్మీదేవి,అంతపురపు స్త్రీలు,గరుక్మంతుడు,గధ శంకచక్రాదులు  బయల్దేరాయని ,

అవి వచ్చాకే కదా తన సుదర్శన చక్రంతో హరి ఆ మొసలి తలను తెగనరుకుతాడు అని నాకు సమధానం తట్టింది నాకు ఆ తర్వాత.

ఏదేమైనా ఆ సమాధానం నాకు సంతృప్తిగా లభించాక చాలా ఆనందం వేసింది అక్కడే,

జ్ఞానం ఎంత ఆనందాన్ని ఇస్తుందో కదా అని కూడా అనిపించింది అప్పుడు,ఈ ప్రపంచంలోని జ్ఞానాన్ని అంత్తా దోసిళ్లలో పట్టుకుని తాగెయ్యలనేంత పిచ్చి కోరికీ కలిగింది ఆ సమయాన...!!! "

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి