24 మార్చి, 2016

ఏకాంతం - గొప్ప సహచరుడు



సంగీతం,సాహిత్యం సరస్వతీదేవి " స్తనద్వయం " లాంటివి.

నేను జ్ఞానంలో శైశవాన్ని....!!!

తల్లి దగ్గర చనుపాలు తాగే పిల్లవాడికి ఉన్నంత నిశ్చింత,ప్రశాంతత,ఆనందం కలుగుతోంది ఎక్కువగా నాకు ఈమధ్య,

అసలు సంగీత,సాహిత్యాలు ఇచ్చే ఆనందానికి అలవాటుపడితే ఎందుకో ఎక్కువగా మాట్లాడబుద్ది అవ్వదనుకుంటా,

అందుకే ఈమధ్య నా ఫ్రెండ్స్ తో మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది నాకు.
ఏం మాట్లాడతాం అస్తమానూ వీళ్ళతో అని అనిపిస్తోంది,

అబ్బాయిలతో అయితే " ఆ అమ్మాయి నాకిలా పడిపోయిందనో,లేక అమ్మాయిల ప్రవర్తనల గురించి ఓ 4 మానసిక విశ్లేషనలు " , అమ్మాయిలతో అయితే " మా బాబాయి ఇలా చేశాడు,మా మావయ్య ఇలా అన్నాడు,నా ఫ్రెండ్ ఈ రోజు ఏం చేసిందంటే ?" అనే రకమైన మాటలే వస్తున్నాయి.

నాకెందుకు ఈ సోది అని అనిపిస్తోంది,కాని వాళ్ళ మాటలంటే ఆసక్తి ఉన్నట్లు నటించాలి. దానర్ధం నేనేదో మానసికంగా వారందరికంటే ఎదిగేశానని కాదు,

కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఏ ప్రకృతినో చూస్తూ భావుకత్వంగా ఆలోచనలు ఆలోచించుకుంటూ ఆ ఆలోచనలను కవితల్లా రాసుకోవడమో,లేక ఏ త్యాగరాజ కృతినో,అన్నమయ్య కీర్తననో వింటూ సంగీత సాధన చేసుకోవడమో,లేక ఏ మంచి సాహిత్యంకి సంబందించిన పుస్తకం చదువుకోవడమో నాకు ఎక్కువ ఆనందం కలగచేస్తోంది.

మౌనంలో ఉన్న ఆనందం ఓసారి అనుభవంలోకి వస్తే, మాటల్లో ఎందుకో అంత ఆనందం కనపడదేమో.....!!!!!!

ఇది ఒంటరితనము కూడా కాదు,ఎందుకంటే నాతో ఓసారి మాట్లాడిన వాళ్ళు కూడా నాతో తరవాత మాట్లాడాలన్నా,నా కంపెనీని కూడా ఇష్టపడతారు,అయినా కూడా నేను" వ్యక్తి ఏకాంతాన్నే " ఎక్కువగా ఇష్టపడుతున్నాను.

చూద్దాం ముందు ముందు నా జీవితం ఎలా ఉండబోతోందో,ఇప్పటి వరకూ అయితే ఎటువంటి మానసిక శూన్యత అనేది అనుభవించలేదు మరి నేను....!!!!!

- Kiran​

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి