27 మార్చి, 2016

Emotion Vs Logic



మనిషి యొక్క చేతలను లాజిక్,,ఎమోషన్ అనే రెండు అంశాలు బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి...ఈరెండు అంశాలకీ చాలా సంధర్భాలో పొంతన కుదరదు...కానీ రెండూ అవసరమే మనిషి జీవితానికి...ఈరెంటిలో ఏదీలోపించినా మనిషి జీవితం అర్ధంలేని విషయంలా తోస్తుంది...

***********************************************************************************

మొన్నామధ్య మాంఛి కాశీపట్టుపంచె కట్టుకుని ఉదయం గుడికెళ్ళి  తిరిగి ఇంటికి వచ్చాను....ఆ రోజు సాయంత్రం ఎందుకోకాస్త ఒళ్ళు వేడెక్కి జ్వరంతగిలింది నాకు.... డాక్టర్ గారు వచ్చి పరీక్షించి " పెద్దగా జ్వరం ఏంలేదండీ " అని  కొన్ని మందులు రాసిచ్చి వెళ్ళిపోయారు...అంతా ఓకే....

ఆ మాత్రలు వేసుకుని  నేను పడుక్కోబోయేముందు మా అమ్మగారు నా గదిలోకి వచ్చి " ఆ పట్టు పంచె కట్టుకుని బయటకి వెళ్ళావు కదా ? ఎందరి కళ్ళు  పడ్డాయో నీమీద  ..!!! అందుకే ఇలా జ్వరం వచ్చింది " అని ఉప్పు తన గుప్పిటిలో పట్టుకుని దిష్ఠి తీయబోయారు....

నేను వద్దని వారించాను మా అమ్మగారిని.... " హేతువులేని నమ్మకాలని నేను నమ్మనని నీకు తెలుసుగా అమ్మా? మరేంటే ఇది ? అయినా ఎవరికళ్ళో మనపై పడితే మనకి దిష్ఠి తగలడమేంటే? అయినా దిష్ఠి అంటే ఏమిటీ అనే విషయం మీదే మనకో స్పష్టమైన అభిప్రాయంలేనప్పుడు మళ్ళీ ఆ దిష్టివల్ల జ్వరం కలగడమేమిటే? తర్కానికి ఎంతో దూరంగా లేవు ఈ నమ్మకాలన్నీ??? నువ్వే చెప్పు...!!! అయినా బాగా చదువుకున్నదానివీ,,అందులోనూ మ్యూజిక్లో డిప్లమా చేసిన నువ్వుకూడా ఇలాంటి నమ్మకాలు నమ్ముతావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మా నాకు...!!! " అని అన్నాను నేను మా అమ్మగారితో...

ఓ చిన్న చిరునవ్వు నవ్వి మాట్లాడకుండానే నాకు దిష్టి తీసేసి వెళ్ళిపోయింది మా అమ్మ ....

బుద్ధుడికి బోధి చెట్టుకింద జ్ఞానోదయం అయినట్లు నాకా చిన్న చిరునవ్వులో బోలెడు విషయాలు బోధపడ్డాయి...

" 1. మనిషి మనసుకి సంతృప్తినిచ్చే ప్రతీ విషయానికీ లాజిక్ ఉండాలని రూలేమీ లేదు...అలా ఉండాలని కోరుకోవడంకూడా ఒట్టి మూర్ఖత్వమే అని అనిపించుకుంటుంది చాలా సంధర్భాలలో..

2. ప్రేమ ఉన్న చోట అంతే..!! మనిషి  తన తర్కానికికూడా అందని రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు... " ....

3. మనిషికి  తన ఈ తర్కరహిత ప్రవర్తన ఇచ్చేంత సంతృప్తి,,ఆనందమూ తర్కమూ,,సత్యమూ ఇవ్వగలవా ???

అందుకేనేమో ఈ వేదాంతులూ,,సన్యాసులూ " ఆలూ బిడ్డలూ మాయ,,బంధం మాయ " అని ఎన్నిరకాల విషయవైరాగ్యపు బోధనలు బోధించినా సంసారంలో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతారు ప్రజలంతా...

బంధంలో ఉండే గొప్పతనమే ఇది.... " అని అనిపించింది ...

ఏమంటారు దీనిగురించి ?

-  Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి