పొద్దున్న నా గదిలో కూర్చుని పిల్లలమర్రి పిన వీరభద్రుడు రాసిన " శృంగార శాకుంతలం " చదువుతూ ఉంటే తెలిసిన ఒకాయన వచ్చి నన్ను పలకరించి " ఏ పుస్తకం చదువుతున్నావురా కొత్తగా ? " అని అడిగితే " శృంగార శాకుంతలం " చదువుతున్నాను అని చెప్పాను నేను...వెంటనే ఆయన మొహంలో హావభావాలు మారిపోయి నా దగ్గరకి వచ్చేసి నేనేదో చదవకూడని పుస్తకం చదువుతున్నాను అన్నట్లుగామాట్లాడాడు నాతో... నా దగ్గర ఆ పుస్తకం తీసుకుని అట్ట చూస్తూ " ఈ వయసులో నీకు శృంగారం గురించి ఎందుకురా? " అన్నట్లు తేలికగా మాట్లాడాడు..
ఆయనకి ఏమని సమాధానం చెప్పాలో అర్ధంకాలేదు నాకు.. పుస్తకం పేరులో శృంగారం అని ఉన్నంతమాత్రాన అదో అసహ్యకరమైన పుస్తకంగా జమకట్టిన ఆయనకి ఈ పుస్తకం యొక్క గొప్పదనం గురించి ఎలా వివరించాలో తెలియలేదునాకు... " వాసకసజ్జనకి విప్రలబ్దకి ఉండే తేడా ఇదీ...!!! ఇదిగో ఈ భావం ఎంత అద్భుతంగా ఉందో చూడు...!!! " అని ఏమైనా చెప్తే అవి బూతులుగా పరిగణిస్తారేమో ఇలాంటి వ్యక్తులు...
అసలెంతో సునిశితమైన పరిశీలనా దృష్టి,,ఊహా ఉంటేకానీ వర్ణన చెయ్యడం అసాధ్యం.అలాంటిది సూర్యోదయం,,సూర్యాస్తమయం,,చంద్రోదయం,,ఋతు వర్ణన,,నాయకా,,నాయకి సౌందర్య వర్ణనలతో గొప్ప రసపుష్టిగల కావ్యం రాయడమంటే మాటలా??? అవిచదవడమే మన అదృష్టం అనుకోవాలికానీ అసలు అందులో ఏముందో కూడా తెలియకుండా ఒక్క ఊపులో ఆ కావ్యాన్ని ఆయన అర్ధంలేని విషయంగా మాట్లాడుతుంటే చలం మాటలు గుర్తొచ్చాయి... " ఆర్టిస్టిక్ సెన్స్ " పూర్తిగా నశించిన వ్యక్తుల గురించి ఇలా అంటాడు తన " మ్యూజింగ్స్ " లో
" ఏదో
తింటాం,కాపరిస్తాం,కంటాం,పెంచుతాం
,అనే మనుషులుగాక,ఈ లోకంలోని రసాన్ని
అందుకుంటామని ప్రయత్నించే వ్యక్తులు తక్కువ ఈలోకంలో..
తింటాం,కాపరిస్తాం,కంటాం,పెంచుతాం
,అనే మనుషులుగాక,ఈ లోకంలోని రసాన్ని
అందుకుంటామని ప్రయత్నించే వ్యక్తులు తక్కువ ఈలోకంలో..
" Dead Beauty " ని అనుభవిస్తున్నారు ఈ
ప్రజలు. ఆత్మల్ని నాశనం చేసి, స్వేచ్చ
కాళ్ళు విరగ్గొట్టి, కళేబరాల్ని
కావిలించుకుని సుఖపడుతున్నారీనాటి
ప్రజలు... వీళ్ళకి
'' Art " నశించింది.హృదయం
చచ్చిపోయింది. " అని....
ప్రజలు. ఆత్మల్ని నాశనం చేసి, స్వేచ్చ
కాళ్ళు విరగ్గొట్టి, కళేబరాల్ని
కావిలించుకుని సుఖపడుతున్నారీనాటి
ప్రజలు... వీళ్ళకి
'' Art " నశించింది.హృదయం
చచ్చిపోయింది. " అని....
మహా మహా పండితులతోనూ,,విద్వాంసులతోనైనా మాట్లాడడం పెద్ద కష్టం కాకపోవచ్చేమోగానీ " కళళెందుకు? కవిత్వాలెందుకు? " అన్నట్లుగా మాట్లాడే ఇలాంటి వ్యక్తులతో మాట్లాడడం మాత్రం చాలా కష్టమైన పనే...
ఏమంటారు?
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి