వ్యక్తిగతంగా నాకు సూఫీ సాహిత్యమన్నా,,జెన్ బుద్దిజం అన్నా బాగా ఇష్టం....
వీళ్ళు చెప్పే ఫిలాసఫీ భలేగా ఉంటుంది... స్వర్గం,,నరకం పాపం,,పుణ్యం,,పునర్జన్మ,,కర్మ,,జీవుడు,,దేవుడు అంటూ లోతుగా పోకుండా ఉన్న ఈ వాస్తవిక జీవితాన్ని మనిషి మరొక్కరికి నష్టం కలిగించని రీతిలో ఎంత గొప్పగా,,ఆహ్లాదకరంగా,,ఆనందకరంగా,,సంతృప్తికరంగా గడపచ్చో బ్రతకవచ్చునో చెప్తారు వీళ్ళు...
ముఖ్యంగా జెన్ బుద్దిజంలో అయితే సన్యాసులు కూడా " ఆలుబిడ్దలూమాయ,,బంధం మాయ " అనే విషయవైరాగ్యాన్ని బోధించక కుటుంబతో ఎలా ఉండాలి?? నలుగురితో ఎలా మెలగాలి??కోపం,,ద్వేషంలాంటి దుర్లక్షణాలను ఎలా తగ్గించుకోవాలి? అని చిన్న చిన్న పిట్టకధలతో అద్భుతంగా,,చాలా ప్రభావవంతంగా సూటిగా చెప్తారు మనకి...
అందుకే వీలు దొరికినప్పుడల్లా నేను ఈ జెన్ బుద్దిజంకధలూ,,సూఫీ సాహిత్యమూ చదువుతూ ఉంటాను...
అలా ఈ రోజు సూఫి సాహిత్యంలోని ఒక మంచి కధ చదివాను..
ఆ కధ మీకోసమిదిగో...
"" ఒకరోజు ముల్లానజరుద్దీన్ దిగాలుపడి కూర్చుని ఉన్నప్పుడు అతని మిత్రుడు వచ్చి " ఎందుకిలా దిగాలుగా ఉన్నావు? " అని అడిగాడు..అందుకు ముల్లా భోరుమని ఏడుస్తూ " నా మామ తన యావదాస్థినీ నాకు రాసిపెట్టి క్రితం నెల చనిపోయాడు ,అది తలుచుని ఏడుస్తున్నాను " అని అన్నాడు..
అప్పుడు ఆ మిత్రుడు " మీ మామగారు నాకు బాగా తెలుసు, ఆయనకి 80 ఏళ్ళు కదా? ఆ వయసులో మరణం సహజమే ఎవరికైనా...అందుకింత బాధపడడం దేనికి? నిజానికి అతని ఆస్థి అంతా నీకు దక్కినందుకు నువ్వెంతో సంతోషించాలి " అని అనునయించే ప్రయత్నం చేశాడు.
" నా బాధ నీకు తెలియదు మిత్రమా, పోయిన వారమే లక్షరూపాయలు విలువగల తన సొత్తు నా పేర రాసి నా బాబాయి కూడా చనిపోయాడు " అనింకా పెద్దగా ఏడ్వసాగాడు ముల్లా.
మిత్రుడు అయోమయంలో పడి " మీ బాబాయి కూడా నాకు బాగా తెలుసు,ఆయనకు 85 ఏళ్ళు,ఆస్థి దక్కిందని సంతోషపడకుండా ఇలా ఏడుస్తున్నావే నీకేమైనా పిచ్చి వచ్చిందా? " అన్నాడు మిత్రుడు చిరాకుగా.
" ఇప్పుడు నాకు మరింత దిగులుగా ఉంది, నూరేళ్ళు నిండిన మా తాత 2 లక్షలకుపైగా విలువగల ఆస్థిని నా పేర రాసేసి నిన్ననే కన్ను మూశాడు " అని ముల్లా అనేసరికి ఆ మిత్రుడికి మండిపోయి ' నువ్వు ఎందుకిట్లా ఏడుస్తున్నావో నాకేమీ అర్ధం కావట్లేదు ' అని అన్నాడు తలపట్టుకుని.
కళ్ళు తుడుచుకుని ముల్లా ఇలా అన్నాడు - " సంపన్నులైన నా మామ,బాబాయి,తాత ముగ్గురూ చనిపోయారు కదా ! ఇకమీదట నాకు ఆస్థి రాసిపెట్టి చనిపోవడానికి వేరే బంధువులెవరూ లేరే !!! " అని తిరిగి ఏడ్చాడట... ""
ఈ కధలో ఒక చక్కని సందేశం దాగి ఉంది.
" మన సంతోషానికీ, తృప్తికీ ఎల్లలు ఏర్పరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆ హద్దులు మీరితే ఎటువంటి సంతోషమైనా మనిషికి తృప్తిని ఇవ్వలేదు. చిల్లుపడిన బానలో ఎన్ని నీళ్ళు పోసినా నిలవనట్లే తృప్తి చెందలేని స్వభావం కలిగిన మనుషులకి ఏ సంతోషమూ దక్కదు.
" ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను " అని కొన్ని అనవసరమైన కొరికలని కోరుకుంటాం మనం, అదే మనలోని లోపం.
ఇలాంటి వారి మనసెప్పుడూ అసంతృప్తితో నిండిఉండి తన దగ్గరలేని వాటి గురించి చింతిస్తూ ఉంటారు.
చిల్లుని బాగు చేస్తే కుండ నిండుతుంది కదా.
అదేవిదంగా మన మనసులోని లోపాన్ని సరిదిద్దుకున్నప్పుడు మనలో సంతోషం వెల్లివిరుస్తుంది..
సంతోషం అంటే గుర్తొచ్చింది,,సంతోషం గురించి నేను చదివిన ఓ గొప్ప వాక్యం ఇక్కడ ఉదహరించి నా ఈ పోష్ట్ని ముగిస్తాను.
" సంతోషమనేది తాళంకప్పలాంటిది...జ్ఞానం తాళంచెవి వంటిది...తాళంచెవిని ఒకవైపుకి తిప్పితే సంతోషం తలుపులు మూసుకుపోతాయి...మరోవైపుకి తిప్పితే సంతోషం దర్వాజాలు మనకోసం తెరుచుకుంతటాయి...నిర్ణయం అనేది నీ వ్యక్తిగతం " ..
బాగుందికదూ?
శుభసాయంత్రం :)
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి