02 మార్చి, 2016

శ్రీనాధుడు రాసిన " భీమఖండం " గురించి



ఈమధ్యన శ్రీనాధుడు రాసిన " భీమఖండం " చదివాను నేను...

స్కాందపురాణంలో అంతర్గతమైన ఓ ఘట్టాన్ని ప్రధాన కధావస్తువుగా తీసుకుని ఈ కావ్యాన్ని శ్రీనాధుడు చాలా అద్భుతంగా రాశాడు.

ఇందులో శ్రీనాధుడు ప్రధానంగా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి లింగోత్పత్తి గురించి,,ఆ స్వామి మహత్యం గురించీ,,ఆ శివలింగ వర్ణనా ,,సప్తగోదావరి తీర్ధ మహత్యము,,అలాగే కాశీ విశ్వేశ్వరుని ఆగ్రహానికి గురైన వ్యాసుని యాత్రా విశేషాలూ,,క్షీరసాగర మధన ఘట్టమూ మరియూ వివిధ దానాల మహిమా,,వసంతఋతు వర్ణనా వివరిస్తూ రాశాడు...

ఇక ఇందులో పిఠాపురాన్నీ,,కుమారారామాన్నీ (సామర్లకోట భీమేశ్వరుని ఆలయం ఉన్న ప్రాంతం ),,సర్పవరాన్నీ శ్రీనాధుడు వర్ణించి రాసిన ఆ పురవర్ణనలు చదివితే చాలా ఆశ్చర్యం వేసింది నాకు... " చిన్నప్పటినుంచీ,,డిప్లమా చదివే రోజుల్లో నేను తిరిగిన ఆ ఊళ్ళు ఇంత గొప్పవా? శ్రీనాధుడిచే వర్ణింపబడిన ఊరిలో నేనుంటున్నానా? " అని ఆనందం కలిగింది నాకు అవి చదివాక..వ్యాసులవారూ,,అగస్తులవంటి మహామహులు తిరిగిన ఊరిలో నేనుండడం ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం అనుకుంట.

సరే ఈ విషయం పక్కనెడితే,,ఇందులోని చంద్రోదయ వర్ణనా,,సూర్యోదయ వర్ణనా,,సంధ్యాసమయ వర్ణనా,,ఋతు వర్ణనా కూడా బాగా చాలా బాగా రాశాడు శ్రీనాధుడు...నాకు వీలైనప్పుడు ఆ విశేషాలు రాస్తాలెండి..

చివరగా చెప్పే మాట ఏమిటంటే సాహిత్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది...వీలైతే తప్పకుండా చదవండి..

శుభరాత్రి smile emoticon

- Kks Kiran


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి