04 డిసెంబర్, 2016

Whatsappలో విసిగించే Spam మెసెజ్లకి నేనిచ్చిన కౌంటర్



వాట్సాప్లో విరివిగా వచ్చే కొన్ని ఫార్వార్డ్ మెసేజులు చాలా యెటకారంగా ఉంటాయి... అస్సలు లాజిక్ ఉండదు వాటిల్లో... అయినా కొన్ని వేల షేర్లు అవుతూంటాయి ఏంటో చాలా ఆశ్చర్యంగా...

ఉదాహరణకి,,

(" ఈ 10 నామాలు చదివిన వెంటనే షేర్ చెయ్యండి,, లేకపోతే రక్తం కక్కుకుని మరీ మీరు ఛస్తారు " అని దైవభక్తి పేరిట ఎమోషనల్ బ్లాక్మైల్ చేసే మెసేజుల గురించి ఇంతకుముందే రేవేసేశాను కాబట్టి ఆ ప్రసక్తి మళ్ళీ ఇక్కడ తేవట్లేదు నేను )

1. మానవత్వం,జాలి పేరిట వచ్చే మెసేజులు :-

( ఎవడో దిక్కుమాలినవాడి ఫొటో ఒకటి అటాచ్మెంట్లా వస్తుంది ముందు ,, ఆ తర్వాత... )

" ఈ ఫోటోలో ఉన్న బాబుకి బ్లడ్ కాన్సర్,, ఆపరేషన్ కి ఐదులక్షలవుతుంది.. మీరు ఈ మెసేజ్ పంపితే ప్రతీ షేర్కీ 5 పైసలు చొప్పున వాట్సాప్ కంపెనీ వాళ్ళకి సాయం చేస్తుంది.. కనుక వీలైనంత ఎక్కువమందికి ఈ మెసెజ్ షేర్ చేసి ఈ బాబుకి ప్రాణదానం చెయ్యండి " అని...

మనకి మానవత్వం ముందే ఎక్కువకదా?? అందులో నిజమెంతో కూడా ఆలోచించకుండా ' వాట్సాప్ వాడు ఒకే మెసెజ్ కొన్ని వందలమందికి ఒక్కసారిగా పంపే ఆప్షన్ ఈమధ్యే ఇచ్చాడు కదా...!!! ' అని అందరినీ సెలెక్ట్ చేసేసి సెండ్ బటన్ నొక్కేసి " ఆ బాబుని మనం కాపాడేశాం " అని ఓ మానసిక తృప్తిని (?) పొందేసి మళ్ళీ ఆ విషయమే మర్చిపోతాం చాలా కన్వీనెంట్ గా...

కాస్తంత బుర్ర ఉపయోగించి ఆలోచిద్దాం దీనిని...

ఎక్కడో అమెరికాలో ఉన్న వాట్సాప్ కంపెనీ ఆంధ్రాలో ఉన్న వీళ్ళకి సహాయం చేస్తానని అనడమేమిటి? పోనీ ఆ కంపెనీ సీ.యీ.ఓ మనకీ, మన మీడియాకీ తెలియకుండా ఆంధ్రాకి వచ్చి,, తెలుగు తెలిసీ,, వీళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళకేదో సహాయం చేస్తాననే అన్నాడనుకుందాం... 

ఆ సాయం ఏదో ఒక్కసారే చెయకుండా షేర్కి ఇన్ని పైసలు ఇస్తానని నిబంధన విధించడం ఏమిటి? ( మీకు తెలుసో లేదో,,వాట్సాప్ కంపెనీని ఫేస్బుక్ వాళ్ళు 1,80000 కోట్లు పెట్టి కొనుకున్నారు,, అంత విలువగల కంపెనీ ఓ అతి చిన్న సాయానికి ఇలాంటి అర్ధంపర్ధంలేని నిబంధనలు పెడుతుందా? )

" పైగా ఇన్ని షేర్లు వచ్చాయి ఈ మెసేజ్కి " అని తెలుసుకునే అవకాశమే లేదు  వాట్సాప్లో,, మరెలా కౌంట్ అవుతాయి ఆ మెసేజులు? పైగా షేర్కి ఇన్ని పైసలు చొప్పున లెక్కకట్టుకుంటూ ఉంటే ఈలోపులో పుణ్యకాలం కాస్తా గడిచి వాడేవడో టపా కట్టెయ్యడా ఆపాటికే??? "

ఒక్కటంటే ఒక్క లాజిక్ ఉందా ఇందులో...

అయినా ఇందులో ఒక్కటీ ఆలోచించకుండా పంపుతాం మనం మానవత్వం పేరిట..

ఇక రెండో రకం,,

హెచ్చరిక గల మెసేజులు :-  

"  భూమికి దగ్గరగా ఉల్క ఒకటి వస్తోంది,, ఆ సమయంలో మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే బ్లాస్ట్ అయిపోయి మీ ప్రాణానికే ప్రమాదం కల్గుతుంది అని నాసా వాళ్ళు ప్రకటించారు... కనుక మూడు సెకన్ల మూడు ఘడియల మూడు నిముషాలకి మీరు సెల్ దగ్గరలేకుండా జాగ్రత్తపడండి.. అర్జంట్గా ఈ మెసేజ్ మీ ఆప్తులకి కూడా పంపండి... లేకపోతే మీకూ మీ దగ్గరవాళ్ళకి ప్రమాదం " అని వస్తాయి అస్సలర్ధంలేకుండా??

ఇలాంటి మెసేజులు చూస్తే నిజంగా పిచ్చెక్కుతుంది నాకు..

" భూమి దగ్గరకి ఉల్క రావడం ఏమిటి? వచ్చిందే అనుకో...!!! భూ వాతావరణంలో అది ప్రవేశించగానే మండి నాశనమైపోతుంది కదా? అంతగా మండకపోతేకనుక మనకి అత్యాధునిక రాడార్ సిస్టం ఉంది కాబట్టి అది మన భూవాతావరణంలోకి ప్రవేశించేముందే  పేల్చేయచ్చు కదా??... ఇక ప్రమాదం ఏముంటుంది నిజానికి ఇందులో ??? పైగా సెల్లులు పేలిపోవడం ఏమిటి అదొస్తే " అని అస్సలర్ధంకాక జుట్టు పీక్కొన్నాను ఓసారి..

దీనికన్న హైలేట్ మెసేజ్ ఇంకొకటి..

"" ఫలానా కంపెనీ డ్రింక్లో చెన్నై బ్రాంచ్ కి చెందిన ఓ ఎంప్లాయ్ ఎబోలా వైరస్ కలిపాడు ( ఇంకొన్ని మెసేజ్లలో ఎయిడ్స్ కలిగించే వైరస్ కలిపాడని మనకి జాగ్రత్తలు చెప్తూంటారు 😳  )... కనుక ఆ కంపెనీ డ్రింక్స్ తాగకుండా ఉండండి "" అని..

ఇటువంటి మెసేజ్లు పంపేముందు ఒకటి ఆలోచించండి... ఇవి కొన్ని కొన్ని సంస్థలో,, లేక కొందరు వ్యక్తులో మిగతా కంపెనీల సేల్స్ని తగ్గించడానికి చేసే కుట్రపూరితమైన పనులు.. నిజానిజాలేమిటో కనీసం ఆలోచించకుండా మనం వీటిని వ్యాప్తి చెందిస్తే మనమూ ఆ కంపెనీకి పరోక్షంగా నష్టం చేసినట్లు అవ్వదా??

లేకపోతే తాగిన మనకి ఎయిడ్స్ రావాలని ఎవడైనా వైరస్ కలుతారా చెప్పండి?? వాడికీ మనకీ శత్రుత్వం ఏమైనా ఉందా ఏమిటి? పోనీ ఎవడో పిచ్చాడు కలిపాడనే అనుకుందాం... మనం అందరం సైన్స్ చదువుకున్న స్టూడెంట్లమే కదా???

బాక్టీరియాలు అంత టైం బయట బ్రతకగలవా?? పైగా అటువంటి డ్రింక్లలో అవి మనుగడ సాగిస్తూ ఎలా జీవించగలవు?? అవి తమని తాము పోషించుకుంటూ మనలని ఎలా ప్రభావితం చేస్తాయి?? పైగా చల్లదనంలో వాటి జీవక్రియ కూడా దెబ్బతింటుంది కదా?

ఇలా గట్టిగ్గా క్వశ్చన్స్ మనకి మనమే వేసుకుంటే ఒక్కటంటే ఒక్కదానికి సమాధానం సంతృప్తిగా దొరుకుతోందా?? అయినా మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంతమందికి ఇవి ఫార్వార్డ్ చేస్తున్నమంటే మనకి ఆలోచన ఉనట్లా లేనట్ల్లా???

ఆలోచించండోసారి...!!!

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి