23 నవంబర్, 2016

గీతాంజలిలోని ఓ ఆధ్యాత్మిక గీతం


" నే నీ జీవిత ప్రాంగణాన్ని దాటి
ఎపుడీ లోకంలోకి వచ్చానో నాకు జ్ఞప్తిలో లేదు..

అరణ్యంలో అర్ధరాత్రి పుష్పించే కుసుమంవలె
ఈ అనంత నిగూఢ అద్భుత ప్రపంచంలోకి
ఏ శక్తి నన్ను వికసింపచేసిందో...!!!

ఉదయాన నేను కళ్ళు విప్పగానే తెలిసింది,,

ఈ లోకానికి నేను నూతనుణ్ణి కాననీ
నామరూప రహితుడైన పరమాత్మే
నా తల్లి రూపాన తన చేతుల్లోకి నన్ను తీసుకున్నాడనీ..

అట్లానే మృత్యువులో సహితం 
ఆ పరమాత్మే చిరపరిచితుడై నాకు దర్శనమిస్తాడు.
ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను,
కనుక నేను మృత్యువునీ ప్రేమిస్తానని తెలుసు..

తన కుడి స్తనం నుంచి తల్లి తీసినప్పుడు
శిశువు ఏడుస్తుంది..
కానీ మరుక్షణమే ఎడమ స్తనంలో
ఓదార్పు పొందుతూందా లేదా? "

( చలం అనువదించిన రవీంద్రుని " గీతాంజలి " నుండి సేకరణ )

శుభసాయంత్రం 😊

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి