14 అక్టోబర్, 2016

భార్యను అర్ధం చేసుకోవడం ఎలా? అర్ధం చేసుకుని ప్రేమించడంఎలా?



" నా భార్య ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటుంది..అస్తమానూ తప్పులు వెదుకుతూ ఉంటుంది..అసహనం,విసుగు ప్రకటిస్తూ ఉంటుంది... " అని చాలామంది భర్తలు అభిప్రాయపడుతూ ఉంటారు..

కానీ భార్య ఎందుకలా విసుక్కుంటుందో,,దానికి కారణాలేమిటో ఆలోచించే భర్తలెంతమంది?

చాలావరకూ భర్తలు , తమ ఇంటిని ఒక హొటల్ రూంలా అనుకుంటారు... ఇంటిని చక్కదిద్దుకోవడం,పిల్లలను తయారు చేసి స్కూల్కి పంపడం,ఇంటికి కావాల్సిన సరుకులు తేవడం మొదలైనవన్నీ భార్య బాధ్యతే అని,,వాటిపట్ల తమకేమీ సంబంధంలేదనే అనుకుంటారు...

కానీ ఉదయం లేచినప్పటినుంచీ రాత్రి పడుకునేవరకూ ప్రతీ నిమిషం పనిలో మునిగిపోయి శరీరమూ,మనస్సూ అలసిపోయిన భార్యకి తన అలసటా చిరాకూ కోపంగా మారి బయటకు రావడం సహజమే కదా?

ఇంటి వ్యవహారాలపట్ల ఏమాత్రం బాధ్యతలేకుండా నెల తిరగ్గానే జీతం తెచ్చి భార్య చేతిలో పెట్టగానే తనవంతు కర్తవ్యం అయిపోయిందనుకుంటాడు భర్త... ఇంటికి సంబంధించిన అన్ని పనులనూ తనపై వదిలేసి హాయిగా ఉండిపోయే భర్తను దబాయించడంలో తప్పేమిటో నాకర్ధంకాదు !!

భార్యల కోపం చిరాకులకు మరో కారణం కూడా ఉంది...అదేమిటంటే " భర్త ప్రేమలో లోటు "

ఒక భార్య తన భర్తను ప్రేమించినంతగా ఆ భార్యపట్ల అతను అంత ప్రేమ చూపించలేడని అందరూ సామాన్యంగా అనుకుంటారు...దీనికి మినహాయింపులు ఉంటే ఉండవచ్చు...కానీ చాలామంది మగవాళ్ళు యాంత్రికగా ఆలోచిస్తారు...

విదేశాలకి సంబంధించిన కధ ఇది,,చదవండి.

" ఒక భర్త ఉంటాడు..అస్తమానూ బిజినెస్,బిజినెస్ అని వ్యాపారవ్యవహారలో మునిగితేలుతూ ఉంటాడు..అతడికి వివాహమై ఐదేళ్ళు గడిచింది..కానీ ఒక్కసారి కూడా తన భార్య పుట్టినరోజుని గుర్తుపెట్టుకుని ఒక బహుమతికానీ,,గ్రీటింగ్ కానీ ఇవ్వలేదు...ఈ విషయానికి భార్య బాధపడుతుందన్న విషయంకూడా అతనికి ఈమధ్యే తెలిసింది..

దీనికి పరిహారం చెయ్యాలని ఒక పూలవ్యాపారి దగ్గరకి వెళ్ళి - " ఇదిగో ఈ డబ్బు తీసుకో..ఇక రాబోయే ఐదేళ్ళూ నా భార్య పుట్టినరోజుకి నా పేరున ఒక పూలగుత్తి పంపించాలి " అని భార్య పుట్టినతేదీని ఒక కాగితంపై రాసిచ్చాడు..

కొన్ని నెలల తర్వాత ఆ భార్య పుట్టినరోజు వచ్చింది..ఆ పూలవ్యాపారి ఒక చక్కటి పూలగుత్తిని తీసుకెళ్ళి ఆవిడకి అందించాడు..దాని చివరనున్న తన భర్త పేరు చూసి పొంగిపోయింది భార్య..దానిని గుండెలకి హత్తుకుని,, పరవశంతో కళ్ళుమూసుకుని కూర్చున్న తనని చూసి , ఇంటికి వచ్చిన భర్త అడిగాడట..

" హాయ్,ఎక్కడ కొన్నావీ గులాబీపూల గుత్తుల్ని? ఎంత అందంగా ఉన్నాయో కదా ఇవి?? " అని :p ""

నేను ఈ కధ ఎందుకు చెప్పానంటే - " డబ్బుపెట్టి యాంత్రికంగా చేసే పనులతో మనం ప్రేమను కొనలేము.. ప్రేమ అనేది మనస్సునుండి మనస్పూర్తిగా రావాలి..అలాంటి ప్రేమ కోసమే భార్య నిరీక్షిస్తుంది " అని చెప్పడంకోసమే.

భార్య నలతగా ఉండి పడుకుంటే - " ఇదేమిటి , సాయంత్రం దీపాలు పెట్టేవళ ఇలా అసహ్యంగా పడుకున్నావ్? " అని చీదరించుకోకుండా " ఏమిటి అలా పడుకున్నవ్? నలతగా ఉందా? తలనొప్పా? జ్వరమా? ఏదైనా మాత్ర తెచ్చి ఇవ్వనా? " అని ప్రేమగా పలకరించండి..ఆవిడ సంతోషిస్తుంది..

ఎందుకంటే తను ఎదురుచూసేది కూడా అలాంటి ప్రేమపూరితమైన పలకరింపులే కోసమే కాబట్టి:)

( స్వామీ సుఖబోధానంద రాసిన " మనసా రిలాక్స్ ప్లీజ్ " పుస్తకంలోని ఓ వ్యాసం నుంచి సేకరణ )

శుభసాయంత్రం :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి