బేతవోలు రామబ్రహ్మంగారు అనువదించిన " వాల్మీకి సుందరకాండ " చదివాను నేను ఈమధ్య.
ఎంత గొప్పగా ఉందో?
ప్రతీ వాక్యంలోనూ అద్వితీయమైన,అపురూపమైన,అమోఘమైన వర్ణనలతో వాల్మీకిచే సృష్టించబడ్డ కావ్యామృతసాగరం రామాయణం.అందులో ఈ సుందరకాండ ఇంకా ప్రత్యేకం...
చిన్నప్పటినుంచీ సరళమైన భాషలో ఈ సుందరకాండ కధ వినీ,,చదవడం వల్ల అందులో ఇంత మాధుర్యం ఉంటుందని తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పుడు చదివాక అనిపిస్తోంది ఒక్క కాండే ఇంత సుమధురంగా ఉందంటే మొత్తం రామాయణం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో? అని...
అందుకే ఈరోజు ఉదయం కాకినాడకి వెళ్ళి నేనెక్కువగా పుస్తకాలు కొనే " సుధిత " బుక్ స్టోర్లో " ఆచార్య పుల్లెల రామచంద్రుడు " గారు అనువదించిన " వాల్మీకి రామాయణం ( యధామూలానువాదం,ఏ కాండకి ఆ కాండే విడిగా ఉండి మొత్తం సెట్ ) " తీసుకున్నాను.
అలాగే దానితోపాటుగా ప్రసిద్ధమైన ఈశ,కేన,కఠ,ప్రశ్న,ముండక,మాండూక్య,తైత్తరీయ,ఐతరేయ,బృహదారణ్య ఉపనిషత్తుల యొక్క సరళ వాఖ్యానమూ,తాత్పర్యంగల పుస్తకాలూ కూడా తీసుకున్నాను..
ప్రస్తుతం రామాయణం చదవడం మొదలెట్టాను నేను :)
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి