27 మార్చి, 2016



దేవుడా....!!! 

ఒకందుకు ఈ ఆడవాళ్ళందరికీ తల వంచి వారి పాదాలకి శిరసాభివందనం చెయ్యాలి అని అనిపిస్తోంది....!!!

రెండురోజులనుంచిమా అమ్మగారు ఇంట్లోకి రాలేని పరిస్థితుల వల్ల మొత్తం ఇంట్లో పనులన్ని నేనే చెయ్యల్సి వస్తోంది,

ఏం చేస్తాం....!!! మా ఇంట్లో అందరూ మగజాతే ఒక్క మా అమ్మగారు తప్ప....!!!

ఇంకా పాతరోజులులా ఆ నియమాలేంటి? ఆ ఆచారం వెనుక ఉన్న సైన్స్ని అర్దం చేసుకుందాం అంటే ఇంట్లో ఎవరూ వినరు,వాళ్ళు చెప్పినట్లు చెయ్యకపోతే ఇంకేమైనా ఉందా? మా వంశ మూలకర్తలు,పితరులు,మహర్షులు తిరగపడిపోరూ నాపై ?

పైగా ఎంతో పాపం వచ్చేస్తుంది అని మనుస్కృతి, గరుడపురాణం ముందే భయపెట్టేస్తుంటే ఇక చేసేదేంలేక నోరు మూసుకుని ఇంట్లో అన్ని పనులూ చెయ్యల్సి వస్తోంది...!!

" ఇంట్లో పని చెయ్యగలవా నాన్నా? " అని అడిగినప్పుడూ " అబ్బే...!!! అదెంతసేపు,నేను సులభంగా చేసేస్తాను " అని ఇంటిపని చెయ్యడానికి వప్పుకునే మగవాడంతటి బలిపశువు ఇంకెవరూ ఉండరనుకుంట ఈ ప్రపంచంలో....!!!! 

బాబోయ్....!!! రోజూ ఎలా చేస్తున్నారో ఈ ఆడవాళ్ళు నాకైతే తెలియదు కాని అనుభవంలోకి వచ్చేసరికి " వీళ్ళుపడే కష్టం కంటే అండమాన్ జైల్లో ఖైదీగా శిక్ష అనుభవించడం సులభమేమో " అని అనిపించింది నాకు..!!!!!

పాలు కాచడం,అన్నం వండడం,గిన్నెలు సర్దడం ఇవన్ని చిన్న పనులే కదా? ఏం కష్టపడిపోతారు ఈ ఆడవాళ్ళు ? బయట మనం పడే కష్టం ముందు వీరి కష్టం ఏపాటిది ? అని అనుకునే పురుషపుంగవులారా .....!!! (నాతోసహా,)

మన కష్టం పెద్ద లెక్కలోకి రాదు వీరి కష్టం ముందు, అది తెలుసుకోకుండా పెళ్ళాన్ని చెప్పిన పని చెయ్యలేదని విసుక్కుని కోప్పడడం,తిట్టడం లాంటి పనులు చెయ్యకండి....!!!!!

ఇంకా వాళ్ళు కాబట్టి ఎంతో ఓపికతో మనకోసం ఈ పనులన్నీ చేసి పెడుతున్నారు కానీ, అదే మనమే రోజూ ఈ పనులు చెయ్యల్సి వస్తే " ఇంత కంటే సన్యాసం మేలు " అని ఇల్లు విడిచిపోతాం....!!!!

అంత కష్టమైన పనుల్లా అనిపించాయి ఈ రోజు ఇంట్లో కొన్ని పనులు చేసాక నాకు ......!!!!!! 

కాబట్టి మీ ఇంట్లో ఉన్న మీ భార్య గొప్పదనాన్ని గుర్తించండి,ఆమెకు తగిన గౌరవం ఇస్తూ ఆమెతో మర్యాదగా నడుచుకోండి,సన్యాసం నుంచి తప్పించుకుని చక్కగా సంసార జీవితం గడపండి.

శుభరాత్రి......!!!!!!!

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి