28 ఆగస్టు, 2016

కలలను Record చేసే పరికరం ఉండుంటే...!!!


" కలలని Record చేసుకుని ఆ తర్వాత Play చేసుకునే పరికరం ఏదైనా అందుబాటులోకి బాగుండును " అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు... ముఖ్యంగా కొన్నికొన్ని సార్లు ఉదయాన్నే " కొన్ని అద్భుతమైన కలలు వచ్చాయి " అని లీలగా ఆ కలలలోని విషయాలేవో కొన్ని గుర్తుకొచ్చి అనిపించినప్పుడు " అసలింతవరకూ ఇలాంటి పరికరాలను శాస్రవేత్తలు ఎందుకు ఆవిష్కరించలేదని " ? తీవ్రమైన బాధ కలుగుతూ ఉంటుంది నాకు. అలాంటి పరికరం ఒకటి లేకపోవడం వల్ల ఎన్ని అద్భుతమైన ఆవిష్కరణలు నా నుంచి ఈ ప్రపంచం పొందలేకపోయిందో కదా? అని విచారమేస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు అప్పుడు :p

ఓసారి ఇలాగే,, నేను డిప్లమా చదువుకునే రోజుల్లోనే ఓరోజు ఉదయం అద్భుతమైన కల ఒకటి వచ్చింది నాకు...

అదేంటంటే,,

నేను ఓ SpaceShipలో ఉండి అంతరిక్షలోని విషయాలపై రకరకాల పరిశోధనలు ఏవో చేస్తున్నానట. మెండలీవ్ మూలకాల ఆవర్తన పట్టిక ( mendeleev periodic table ) లో ఇంతవరకూ చేర్చని కొన్ని మూలకాలేవో రెండు కనుక్కున్నానంట. అదీకాక ఇంతవరకూ శాస్రవేత్తలు సోధించని ఓ గొప్ప ఆవిష్కరణ చేసానట నేను ... 

అదేంటంటే " శక్తి నిత్యత్వ సూత్రం ( Law Of Conservation Of Energy ) " ప్రకారం " శక్తిని మనం సృష్టించలేము.. అలాగే నాశనమూ చెయ్యలేము.. కానీ దానిని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చగలము ( Energy can neither be created nor destroyed; rather, it transforms from one form to another ) " కదా? 

అంటే ఇప్పటివరకూ మనం పదార్ధం నుంచి శక్తిని పొందగలుగుతున్నాం కానీ నేరుగా మనం పదార్ధం తయారుచెయ్యలేకపోతున్నాం శక్తి ద్వారా... అలా కాకుండా శక్తిని కొంచం గ్రహించి దాని నుంచి మనం కావాలనుకున్న పదార్ధాన్ని పొందగలిగే ఓ గొప్ప నూతన ఆవిష్కరణ ఏదో నేను చేశానట... ( ఫ్రాయిడ్ అంటాడు తన " Interpretation of dreams " అనే పుస్తకంలో " మన ఆలోచనలకి ప్రతిరూపాలే కలలు.. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అవే కలలుగా వస్తాయి " అని... మరి ఇలాంటి భారీ Science Fiction కల నాకెందుకు వచ్చిందో అప్పుడు? అనేది నేనెరగను మరి...!!! అంతకు ముందురోజు నేనేమీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడకపోయినా,, మరి ముఖ్యంగా ఆ తర్వాతి రోజు నాకేమీ Physics Exam లేకపోయినా సరే ఈ కల ఎందుకు వచ్చిందో మరి ;) )

నా ఈ పరిశోధన మొత్తం అప్పటివరకూ ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని విపరీతంగా ప్రభావితం చేసిందట... మనుష్యుల జీవితాలలో గొప్ప గణనీయమైన మార్పు తీసుకొచ్చిందట. నా ఈ పరిశోధనకి మెచ్చి నోబెల్ బహుమతి కూడా ప్రకటించారట నాకు..

నోబెల్ నిర్వాహకులు సరిగ్గా స్టేజ్ పైకి నన్ను పిలిచి నా పరిశోధన యొక్క సారాంశాన్ని చదివి వినిపిస్తూ ఉండగా వివిధ రంగాలకి చెందిన శాస్త్రవేత్తలూ,మేధావుల కరతాళ ధ్వనుల మధ్య నేనా నోబెక్ల్ ప్రైజ్ అందుకుందామని స్టేజ్ పైకి ఆనందంతో ఆత్రపడుతూ ఎక్కుతూ ఉండగా,,

" కాలేజ్ టైం అవుతోందిరా,, ఎంతసేపా మొద్దు నిద్ర ఇందాకటి నుంచీ లేపుతూ ఉంటేనూ? టైం అప్పుడే ఆరున్నరైంది, ఇక చదువుకోవడం అదీ ఏదీ లేదేంటి " అనే సుప్రభాత రాగంతో మా అమ్మమ్మ నన్ను నిద్రలేపేసింది బలవంతంగా :( 

" అయ్యో...!!! ఇంకొక్క రెండు నిముషాలుండచ్చుకదే??? నోబెల్ బహుమతి ఇప్పుడే ఇస్తూంటేనూ...!!! " అని అన్నాను నేను నిద్రమత్తు ఇంకా వదలక విసుగ్గా...

పిచ్చోడిని చూసినట్లు చూసింది మా అమ్మమ్మ నన్ను ఉదయాన్నే సంధి ప్రేలాపన పేలుతున్నానని... అదేం పట్టించుకోకుండా చాలాసేపు ఆలోచించాను నేనా కల గురించి..

" ఏమేం సూత్రాలతో ఆ ఆవిష్కరణ చేశాను నేను? ఏమేం ఈక్వేషన్లు దానికి ఉపయోగించాను? " ఇలాంటి విషయాలు ఏమైనా గుర్తొస్తాయేమోనని చాలాసేపే ప్రయత్నించాను, కానీ ఏ ఒక్క విషయమూ గుర్తుకు రాలేదు నాకు...

అప్పుడనిపించింది నాకు ఇలా " కలలలని రికార్డ్ చేసుకునే పరికరం ఉండుంటే ఎంతబాగుండునో కదా ? " అని. అది లేక ఆ విధంగా ఓ గొప్ప ఆవిష్కరణ దక్కకుండా పోయింది ఈ ప్రపంచానికి :P

ప్చ్చ్ "



- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి